ఎప్పుడు విడుదల అవుతుందా అని ఈ సంవత్సరం ఎదురు చూసే చిత్రాల్లో మొదట వరసలో నిలబడేది “కేజీయఫ్ 2”. కరోనా గొడవ లేకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబు అవుతూండేది. లాక్ డౌన్, సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహ పరుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎలాగో అదిరిపోయాయి. ఈ విషయం పార్ట్ వన్ చూసిన వాళ్లకు వేరేగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇంకేదో కావాలి. అంతకు మించి ఉండకపోతే అబ్బే సినిమాలో ఏమీ లేదు అని తల తిప్పేస్తారు..పెదవి విరిచేస్తారు.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఈ విషయం తెలుసు. అందుకే ఈ సారి సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కు థీటుగా రెండు ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసారట. ఫస్టాఫ్ లో ఒకటి వస్తే సెకండాఫ్ లో మరొకటి వస్తుందిట. ఈ రెండు సాంగ్స్ లో ఒకదాంట్లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరొకదాంట్లో నోరా ఫతేహి చేయబోతోందిట. ఇందుకోసం స్పెషల్ గా కొరియోగ్రఫీని డిజైన్ చేయమని పురమాయించారట.
ఇవన్నీ చూస్తూంటే… ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఎవరూ ఊహించని, కనీ వినీ ఎరుగని ఫిగర్స్ ను భాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రోజు నమోదు చేయటం ఖాయం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజరు దత్ అధీరా అనే పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తుండగా హోంబేల్ ఫిల్మ్స్ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా.
This post was last modified on May 1, 2021 7:59 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…