Movie News

నాగ్..సొంత ఓటీటి ప్లాన్

కారోనా సెకండ్ వేవ్ మళ్ళీ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు రావడానికి భయపడిపోతున్న సిట్యువేషన్. దీనితో మళ్ళీ ఓటీటీ హవా మొదలైంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్  మూవీగా సంచలనం సృష్టించిన ‘జాతిరత్నాలు’ ఏప్రిల్ 11నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్  అవుతూంటే…  ఏప్రిల్ 14 నుంచి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగు అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ కు కూడ నెట్ ఫ్లిక్స్  స్ట్రీమ్ అవుతోంది. అక్కడ ట్రెండింగ్ లో ఉంది.  

ఇదే బాటలో ‘చావు కబురు చల్లగా’ కూడా  ఓటీటీ లో బాగానే వచ్చింది. మరో ప్రక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వకీల్ సాబ్’ ఓటీటికి వచ్సేస్తున్నాడు.  ఇలా ఎటుచూసినా ఓటీటీ కబుర్లే వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో మనకీ ఓ సొంత ఓటీటి సంస్ద ఉంటే బాగుంటుందనే ఆలోచన నాగార్జన కు వచ్చిందని సమాచారం.

తన స్నేహితులు కొందరితో కలిసి కొత్త తరహా ఓటీటికి సంబంధించి ఆయ‌న ప్లాన్ చేస్తున్నట్లు వినపడుతోంది. ఇప్పటికే అన్న‌పూర్ణ స్టూడియోస్ వరసపెట్టి చిన్న సినిమాలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది‌. ఈ యేడు మినిమం అరడజను సినిమాలు అయినా తన బ్యానర్ నుంచి రావాలని, అదీ ఫిల్మ్ స్టూడియో బ్యాచ్ కు ఆఫర్స్ ఇవ్వటానికి అని నాగ్ ప్లాన్ చేసారట. ఈ సినిమాలు అన్ని  ఓటీటీల కోస‌మేన‌ట‌. అయితే వేరే ఓటీటి లకు ఇవ్వటం ఎందుకు..తనకే ఒకటి ఉంటే ఇంకాస్త స్పీడుగా సినిమాలు చేయచ్చు అని భావిస్తున్నారట. అందులోనూ తమ కుటుంబంలోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్ల సినిమాలు సొంత ఓటీటి ఉంటే రెమ్యునేషన్ లో భాగంగా రైట్స్ అడగొచ్చు అని నాగ్ ఆలోచనగా చెప్తున్నారు.

వైల్డ్ డాగ్ సినిమా ఓటీటిలో హిట్ అవ్వటం నాగ్ కు ఉత్సాహాన్ని ఇచ్చి ఓటీటిపై దృష్టి పడేలా చేసిందిట. ఇప్పటికే ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ.. మొదటిసారి ప్రాంతీయ భాషకు పెద్ద పీఠ వేస్తూ వచ్చిందే ‘ఆహా‘ ఓటీటీ. అప్పటి వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఓటీటీ రంగంలోకి ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకొచ్చింది ‘ఆహా’ ఓటీటీ.ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు మరోవైపు ‘సామ్‌జామ్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళుతోంది. మరి నాగ్ ప్లాన్ చేసే ఓటీటిలో ఏం కొత్తదనం ఉంటుందో చూడాలి మరి. 

This post was last modified on April 30, 2021 8:27 am

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 minutes ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

1 hour ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

7 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago