సున్నితమైన కథాంశాలకు పెట్టింది పేరు శేఖర్ కమ్ముల. ఆయన చిత్రాల్లో భావోద్వేగాలు, వినోదం అన్నీ ఉంటాయి. కానీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల తరహాలో ఉండవు. అందుకే శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన దర్శకుడు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాలని సూపర్ హిట్ చేస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నారు.
ఒక్క స్టార్ హీరో కూడా శేఖర్ కమ్ములతో ఇంతవరకు సినిమా చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ హంగులు ఆయన చిత్రాల్లో లేకపోవడమే కారణం. మహేష్, రాంచరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి శేఖర్ కమ్ముల గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రస్తుతం కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఓ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన కథ సిద్ధం చేసుకుంటున్నారట.
కమ్ముల సిద్ధం చేసుకుంటున్న కథ ఏంటి.. ఆ స్టార్ హీరో ఎవరు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలయింది. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే శేఖర్ కమ్ముల తన శైలిని ఎంతోకొంత మార్చుకోక తప్పదు. కానీ కమ్ముల అలా చేస్తారా అనేది ప్రశ్న. అలాగే లవ్ స్టోరీ సక్సెస్ పై కూడా కమ్ముల తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on April 29, 2021 2:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…