యాత్ర డైరెక్టర్ పై నమ్మకం.. నితిన్ ప్రయోగం

హీరో నితిన్ ప్రేమకథ చేసిన ప్రతిసారి మంచి ఫలితాలని రాబట్టాడు. ప్రయోగాలు నితిన్ కు పెద్దగా కలసి రాలేదు. కానీ వరుసగా ప్రేమ కథలు చేయడం తనకు బోర్ కొట్టేసిందని నితిన్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇకపై కథల ఎంపికలో సెలెక్టివ్ గా ఉండబోతున్నట్లు గతంలో చెప్పుకొచ్చాడు. విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇస్తాడట. 

విభిన్న కథాంశంతో ఈ ఏడాది నితిన్ నుంచి వచ్చిన చెక్ చిత్రం నిరాశపరిచింది. రంగ్ దే మాత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ మాస్ట్రోలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ ఓ డిఫెరెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

యాత్ర చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. మహి వినిపించిన కథ నితిన్ కు బాగా నచ్చిందట. కథ పరంగా నితిన్ పోలీస్ అధికారిగా నటించాలి. కథలో నితిన్ సోదరుడి పాత్ర కూడా పోలీసే. కథాచర్చలు పూర్తయ్యాయి కాబట్టి త్వరలో అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు టాక్. 

మహి వి. రాఘవ్.. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాలతో గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో విడుదలైన యాత్ర చిత్రం రాఘవ్ కు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రం కమర్షియల్ డైరెక్టర్ గా కూడా ఎస్టాబ్లిష్ కావాలని రాఘవ్ ప్రయత్నిస్తున్నాడు.