మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చాన్నాళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిరుతో పాటు చరణ్ సినిమాలు కొన్నింటికి ఆమె పని చేయడం తెలిసిందే. గత ఏడాది సుస్మిత నిర్మాతగానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో బేనర్ పెట్టి భర్త విష్ణుతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా నిర్మించింది.
షూటౌట్ అట్ ఆలేరు పేరుతో తెరకెక్కిన ఆ సిరీస్ జీ స్టూడియోస్ వాళ్ల ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది. ఇప్పుడిక సుస్మిత సినిమా నిర్మాణానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఆమె నిర్మాణంలో రాబోయే తొలి చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. ఓ తమిళ చిత్రం రీమేక్ హక్కులను సుస్మిత సొంతం చేసుకుందన్నది తాజా కబురు.
8 తొట్టకల్.. తమిళంలో నాలుగేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన చిన్న సినిమా. వెట్రి అనే కొత్త హీరో ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఆకాశం నీ హద్దురాతో ఆకట్టుకున్న అపర్ణ బాలమురళి కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాల్లో ఇదొకటి. శ్రీ గణేష్ అనే దర్శకుడు రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓ పాత జపనీస్ మూవీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు. ఇందులో హీరో అయిన పోలీస్.. ఒక నేరస్థుడిని పట్టుకునే క్రమంలో తన రివాల్వర్ కోల్పోతాడు.
దాన్ని దొంగిలించిన వ్యక్తి మరొకరికి దాన్ని అమ్ముతాడు. దీంతో కథ అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రాన్ని ఇప్పటికే కన్నడలో రీమేక్ చేయగా.. అక్కడా హిట్టయింది. ఇప్పుడు సుస్మిత ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసిందట. ఎవరో ఒక యువ కథానాయకుడితోనే ఈ సినిమాను నిర్మించే అవకాశముంది. మెగా ఫ్యామిలీలోనే చాలామంది యంగ్ హీరోలున్నారు కాబట్టి వాళ్లలోనే ఎవరో ఒకరు ఈ సినిమా చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 27, 2021 7:41 am
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…