కొన్ని రోజుల హడావుడి తర్వాత ఈ రోజే హిందీలో ‘సీటీమార్’ పాటను రిలీజ్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధె’లోని పాట ఇది. తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం’లో సూపర్ హిట్టయిన ‘సీటీమార్’ పాట ట్యూన్‌ను హిందీలో యాజిటీజ్‌గా వాడేశారు. ఒరిజినల్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాదే ఈ పాటను కూడా తీర్చిదిద్దాడు. కొన్ని రోజుల కిందట ‘రాధె’ ట్రైలర్లోనే ‘సీటీమార్’ గ్లింప్స్ చూపించారు.
ఇప్పుడు ఈ పాట వీడియోను పూర్తిగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేయడం విశేషం. ఈ పాట గురించి కొన్ని రోజులుగా చిత్ర బృందం మామూలుగా హైప్ ఇవ్వట్లేదు. చివరికి ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. దాన్ని చూసిన వాళ్లలో మెజారిటీ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ‘డీజే’లోని సీటీమార్ పాట చూసిన వాళ్లకు ఇది అస్సలు రుచించట్లేదు. సల్మాన్ వీరాభిమానులు సూపరో సూపర్ అని పొగిడేస్తున్నారు కానీ.. సగటు ప్రేక్షకులు మాత్రం ఇందులో సల్మాన్ స్టెప్పుల పట్ల ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయట్లేదు.
తెలుగు ‘సీటీమార్’లో బన్నీ వేసిన స్టెప్పుల ముందు హిందీలో సల్మాన్ వేసిన డ్యాన్సులు తేలిపోయాయి. బన్నీ వేగాన్ని సల్మాన్ అందుకోగలడని ఎవరికీ ఆశల్లేవు. కానీ స్లోగా అయినా మంచి స్టెప్పులు వేసి ఉంటాడని అనుకుంటే.. అతను తుస్సుమనిపించేశాడు. టీషర్ట ముఖం మీద కప్పుకుని వేసిన స్టెప్ మరీ కామెడీగా ఉంది. అసలు సీటీమార్ సీటీమార్ అనేటపుడు డ్యాన్సే లేకుండా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సైతం తేలిపోయింది. సల్మాన్, బన్నీ స్టెప్పులను పోలుస్తూ అప్పుడే వీడియోలు కూడా రెడీ అయిపోయాయి. ఇవి పెట్టి సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు సీటీమార్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన జాని మాస్టరే హిందీలోనూ నృత్య రీతులు సమకూర్చాడు. కానీ సల్మాన్ అతడికి సహకరించినట్లు లేడు. లేదా సల్మాన్ వల్ల కాదులే అని సింపుల్‌గా ట్రై చేసినట్లున్నాడు కానీ.. పాటలో ఉన్న ఊపు డ్యాన్సుల్లో లేక ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కాస్తో కూస్తో ఈ పాటకు ఊపు తెచ్చింది హీరోయిన్ దిశా పఠానినే. ఆమె స్టెప్పులకు తోడు గ్లామర్ ఈ పాటకు ఆకర్షణగా నిలిచింది.
This post was last modified on April 26, 2021 2:30 pm
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…