సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా నిస్సందేహంగా ప్రతిభగల దర్శకుడు. ఉప్పెన చిత్రంతోనే అతడికి ఫుల్ మార్క్స్ పడిపోయాయి. దిగువ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన బుచ్చిబాబు సుకుమార్ అండదండలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అందివచ్చిన తొలి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరక్కించిన దర్శకుడిపై సహజంగానే కొన్ని పుకార్లు పుట్టుకువస్తాయి. తాజాగా అతడి రెమ్యునరేషన్ గురించి ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. కానీ అది అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. బుచ్చిబాబు తన తదుపరి చిత్రం నుంచి రూ.8 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.
ఉప్పెన తర్వాత ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో బుచ్చిబాబుపై హైప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని అనిపించక మానదు. ఉప్పెన విజయం తర్వాత సుకుమార్ తన ప్రియ శిష్యుడికి కారుని బహుమతిగా ఇచ్చాడు. బుచ్చిబాబు కుటుంబ నేపథ్యం దృష్ట్యా సుకుమార్, మైత్రి సంస్థ ఆర్థికంగా బుచ్చిబాబుకి హెల్పింగ్ హ్యాండ్ అందించి ఉంటుందనేది ఓ అజంప్షన్.
ఇతర నిర్మాణ సంస్థలు కూడా ఓ మంచి ఆఫర్ తో బుచ్చిబాబు వెంటపడుతుండొచ్చు. కానీ ఏకంగా 8 కోట్ల పారితోషికం అనే వార్త ఓ గాసిప్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బుచ్చిబాబు తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా బుచ్చిబాబు మరో కొత్త చిత్రానికి ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
This post was last modified on April 24, 2021 11:13 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…