Movie News

వకీల్ సాబ్ ముందుకు?

గత ఏడాది కరోనా విరామం తీసుకొచ్చిన బలవంతపు విరామం తర్వాత ఇండియాలో రిలీజైన అతి పెద్ద సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. తెలుగులో అయితే గత ఏడాది కాలంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ఇదే. రెండు వారాల కిందటే ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే సినిమా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

తొలి వారంలో ఈ చిత్రం అంచనాలను మించి ఆడేసింది. రెండో వారంలో సినిమా నిలబడలేకపోయింది. కరోనా తీవ్రత బాగా పెరిగిపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. ఇక ‘వకీల్ సాబ్’ డిజిటల్ రిలీజ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో మే 7న విడుదల కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘వకీల్ సాబ్’ డిజిటల్ హక్కులను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు అమేజాన్ ప్రైమ్‌కు అమ్మేసిన సంగతి తెలిసిందే. భారీ మొత్తానికే డీల్ అయింది. సినిమా టైటిల్ కార్డ్స్‌లో కూడా డిజిటల్ పార్ట్‌నర్‌గా ప్రైమ్ పేరు పడుతుంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగా.. ఈ నెల 23నే ప్రైమ్‌లోకి వచ్చేస్తోందంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ అది అవాస్తవం అంటూ నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెలన్నరకే ఈ సినిమా ప్రైమ్‌లో వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది.

సినిమాకు థియేటర్లలో అనుకున్నంత లాంగ్ రన్ లేకపోవడంతో ఒప్పందాన్ని మారుస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడే పరిస్థితి రావడంతో సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందులో భాగంగానే మే 7కు ప్రిమియర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

This post was last modified on April 23, 2021 3:35 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

5 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago