గత దశాబ్ద కాలంలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఉత్తమ నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. ముందు చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతను అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. నెగెటివ్ రోల్స్‌లోనూ అదరగొట్టాడు. ఈ మధ్యే ‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమాలతో విజయ్ సేతుపతి ఎంతగా మెప్పించాడో తెలిసిందే. ఆ సినిమాల్లో హీరోలను మించి హైలైట్ అయ్యాడు సేతుపతి.
తమిళం అనే కాదు.. వివిధ భాషలకు చెందిన ఫిలిం మేకర్స్ విజయ్ సేతుపతితో పని చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అతడి కోసం పాత్రలు సృష్టిస్తున్నారు. తన ముందుకు వస్తున్న లెక్కలేనన్ని పాత్రల నుంచి జాగ్రత్తగా తనకు ప్లస్ అయ్యే వాటిని ఎంచుకుంటున్నాడు సేతుపతి. ఇప్పుడతను ఓ సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో లీడ్ రోల్‌కు రెడీ అయ్యాడు. ఆ దర్శకుడెవరో కాదు.. వెట్రిమారన్.
తొలి సినిమా ‘పొల్లాదవన్’ నుంచి చివరగా తీసిన ‘అసురన్’ వరకు వెట్రిమారన్ తీసిన ప్రతి సినిమా క్లాసిక్కే. ఆడుగళం, విసారణై, అసురన్ సినిమాలు జాతీయ అవార్డుల్లో సత్తా చాటడం.. ‘విసారణై’ ఆస్కార్ అవార్డులకు భారత ఎంట్రీగా వెళ్లడం తెలిసిందే. మిగతా దర్శకుల్లా సినిమాలు చేయడంలో తొందరపడడు వెట్రిమారన్. రెండు మూడేళ్లకు ఓ సినిమా తీస్తాడు. కానీ అంత టైం ఎందుకు తీసుకున్నాడో సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఇలాంటి మేటి దర్శకుడితో సేతుపతి లాంటి విలక్షణ నటుడు జట్టు కడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
వీరి కలయికలో ‘విడుదలై’ (తెలుగులో విడుదల) అనే సినిమా రాబోతోంది. దీని ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. సేతుపతి-వెట్రిమారన్ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే చాలా ఇంటెన్స్‌గా ఉంది ఫస్ట్ లుక్. వెట్రిమారన్ స్టైల్లోనే మరో హార్డ్ హిట్టింగ్ మూవీ చూడబోతున్న భావన కలిగిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుందన్న అంచనాలున్నాయి.
This post was last modified on April 22, 2021 2:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…