‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. రాజమౌళి సినిమా అంటే ఇలా వాయిదాలు మామూలే. కానీ రెండుసార్లకు మించి వాయిదా పడితే మాత్రం చాలా కష్టం. ప్రేక్షకుల్లో వ్యతిరేక అభిప్రాయాలు కలుగుతాయి. ఐతే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాజమౌళి గత సినిమాల్లాగే దీనికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలకు పైగానే వెచ్చించాల్సి ఉంది. ఈపాటికే పూర్తి కావాల్సిన షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇంకా నెలా రెండు నెలలు చిత్రీకరణ కోసం పట్టొచ్చని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు రాజమౌళి. మరోసారి సినిమాను వాయిదా వేస్తే జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుందేమో అని సందేహిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు చూసి వాయిదా నిర్ణయాన్ని ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం.
ఇంతలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ధాటికి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. గత ఏడాది కరోనా కారణంగా ఇలాగే షూటింగ్ ఆపేసి, సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కారణం కరోనా అయినప్పుడు ఎవరూ ఏమీ అనడానికి లేకపోయింది. రాజమౌళిని ఎవరూ విమర్శించలేదు. ఇప్పుడు మరోసారి కరోనా అడ్డు తగిలింది. ఈ కారణంతో కొన్ని వారాల పాటు షూటింగ్ ఆపేస్తున్నారు.
ఈ కారణం చూపి మరోసారి సినిమాను వాయిదా వేయడానికి అవకాశం దక్కింది. కాబట్టి నింద తన మీదికి రాదని, కరోనా మీదికి వెళ్లిపోతుందని రాజమౌళి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి లేదంటే వేసవికి సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. మళ్లీ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు సినిమా వాయిదా గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ కోవలో ‘ఆచార్య’ సహా మరిన్ని పెద్ద సినిమాలు వాయిదా పడటం అనివార్యంగా కనిపిస్తోంది.
This post was last modified on April 21, 2021 9:06 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…