టాలీవుడ్లో చాలా సినిమాల షూటింగ్స్‌కు మళ్లీ బ్రేకులు పడుతున్నాయి. కరోనా ప్రభావం ఉండగానే ఇన్నాళ్లూ షూటింగ్ జరిగాయి. ఇప్పుడు వైరస్ ప్రభావం పెరిగింది. అయినా సరే.. జాగ్రత్తల మధ్య షూటింగ్ కొనసాగిద్దామని చూసినా పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు. పెద్ద ఎత్తున యూనిట్లలో కేసులు బయటపడుతుండటం, అలాగే యూనిట్లో కీలక వ్యక్తులు భయపడుతుండటంతో షూటింగ్స్ వాయిదా వేయక తప్పట్లేదు.
సర్కారు వారి పాట, ఆచార్య లాంటి భారీ చిత్రాల షూటింగ్స్ ఇటీవల ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ‘రాధేశ్యామ్’ బ్యాలెన్స్ టాకీ పార్ట్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లూ చేశాక.. వెనకడుగు వేయక తప్పట్లేదు. సలార్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ అతి కష్టం మీద కొంచెం వీలు చేసుకుని ‘రాధేశ్యామ్’కు కాల్ షీట్స్ ఇచ్చాడు. పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో దాన్ని పూర్తి చేసి ఒక పనైపోయింది అనిపించాలని ప్రభాస్ అనుకున్నాడు.
కానీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ అనుకున్నట్లుగా జరగలేదు. ఆగిపోయింది. ఐతే ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే తాను షూటింగ్‌కు రాలేనని ఖరాఖండిగా చెప్పేసిందని.. అందుకే ‘రాధేశ్యామ్’ టీం ఏమీ చేయలేకపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభాస్ అంత పెద్ద స్టారే రెడీ అయినపుడు పూజాకు ఏమొచ్చిందంటూ కొందరు ఆమెను నిందించడం మొదలుపెట్టారు. కానీ పూజా వల్లే ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఆగిందనడంలో వాస్తవం లేదని సమాచారం. ప్రభాస్ మేకప్ మ్యాన్ కరోనా బారిన పడటంతోనే షూటింగ్ మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారని తెలిసింది.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మేకప్ చాలా కీలకం. సినిమా అంతటా ఒక కంటిన్యుటీ ఉండాలి. ఇప్పటికప్పుడు వేరే మేకప్ మ్యాన్‌ను తీసుకోవడం కష్టమని, ఎలాగూ కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉండటంతో ఇప్పుడు షూటింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదని టీం వెనక్కి తగ్గిందట. అంతకుమించి కారణాలేవీ తెలుస్తోంది.
This post was last modified on April 21, 2021 11:53 am
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…