మూస సినిమాలతో మహేష్ కాలక్షేపం ఎన్నాళ్ళు?!

పుష్ప పోస్టర్స్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మహేష్ ఫాన్స్ కి చివుక్కుమని ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మహేష్ చేయాల్సింది. అనిల్ రావిపూడి సినిమా త్వరగా చేసేయవచ్చు అని మహేష్ దీనిని పెండింగ్ లో పెట్టడంతో సుకుమార్ హర్ట్ అయి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకి తీసుకెళ్లాడు.

మహేష్ ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తున్నాడని, వెరైటీ చూపించడం లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా నటులకి ఉండాల్సిన మేకోవర్ విషయంలో మహేష్ బాగా వెనకబడ్డాడు. పరశురామ్ తో సినిమా చేస్తున్నాడని అన్నా కూడా ఫాన్స్ కి ఆనందంగా లేదు. ఎందుకంటే పరశురామ్ తీసేవి కూడా ఫార్ములా సినిమాలే.

సుకుమార్ లాంటి దర్శకుడు హీరోలని సరికొత్తగా చూపిస్తాడు. రంగస్థలంతో బాక్సాఫీస్ ఎలా గెలవాలో కూడా కనిపెట్టిన సుకుమార్ తో వెంటనే సినిమా చేయకుండా మహేష్ మిస్టేక్ చేసాడు. సరిలేరు నీకెవ్వరు హిట్ అనిపించుకుంది కానీ నటుడిగా మహేష్ కి వచ్చిన బోనస్ ఏమైనా వుందా అనే వాళ్ళ వాదనలోను అర్థం లేకపోలేదు.