Movie News

నాగార్జున ఆన్ లైన్ పాఠాలు


టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున కొన్నేళ్లుగా త‌ర‌చుగా పోలీస్/స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాత్ర‌లు చేస్తున్నాడు. ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాల్లో ఈ టైపు క్యారెక్టర్లే చేశాడు నాగ్. ఇప్పుడు ‘గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయబోయే చిత్రంలోనూ స్పెషల్ పోలీస్ పాత్రలో నటించనున్న సంగతి ఇప్పటికే వెల్లడించారు. ఐతే ఇప్పటిదాకా నాగ్ చేసిన పాత్రలతో పోలిస్తే ఇది కొత్తగా, చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని సమాచారం.

ఈ సినిమా కోసం రియల్ స్టంట్స్ చేయబోతున్నాడట నాగ్. ఇందుకోసం కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త తరహా విదేశీ మార్షల్ ఆర్ట్‌తో పాటు కత్తి యుద్ధం సైతం నేర్చుకుంటున్నారట నాగ్. ఐతే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో విదేశాల నుంచి మాస్టర్‌ను పిలిపించుకోవడం.. లేదా నాగ్ అక్కడికి వెళ్లి శిక్షణ పొందడం కుదరే పని కాదు. అందుకే నాగ్ ఆన్ లైన్ క్లాసులను ఆశ్రయించాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారునే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

బ్యాంకాక్‌లో ఫేమస్ అయిన ఓ మార్షల్ ఆర్ట్ నిపుణుడి నుంచి నాగ్ ఆన్ లైన్ ద్వారా క్రవ్ మగా అనే యుద్ధ కళను నేర్చుకుంటున్నాడట. కొన్ని రోజులుగా ఈ క్లాసులు నడుస్తున్నాయట. ఆన్ లైన్లో అక్కడి నుంచి సూచనలిస్తుంటే.. నాగ్ ఇక్కడ ఓ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి సాయంతో ట్రైన్ అవుతున్నాడట. అలాగే కటానా అనే కత్తి యుద్ధ కళను సైతం నాగ్ నేర్చుకుంటున్నట్లు ప్రవీణ్ వెల్లడంచాడు.

నాగ్ పోషిస్తున్నది రా ఏజెంట్ పాత్ర అని.. దేశం కోసం ఎక్కడెక్కడో గడిపి 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చే పాత్ర ఇదని.. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో అటాచ్ కావడం, ఆ తర్వాత మళ్లీ ఓ ఆపరేషన్ మీద పని చేయాల్సి రావడం.. ఈ నేపథ్యంలో కథ నడుస్తుందని సమాచారం. డ్రామా, ఎమోషన్స్, థ్రిల్స్.. ఇలా అన్నీ ఉండే సినిమా ఇదని ప్రవీణ్ అంటున్నాడు. ఇందులో బాలీవుడ్ భామ గుల్ పనాగ్ నాగ్‌కు జోడీగా నటించబోతోంది. పవన్ కళ్యాణ్ మాజీ మిత్రుడైన శరత్ మరార్.. ఇంకో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

This post was last modified on April 19, 2021 11:42 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

39 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

46 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago