‘బిగ్ బాస్’ షోతో వచ్చే పాపులారిటీని సినిమాల వైపు సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్లు తక్కువే. తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్లో విజేతగా నిలిచిన శివబాలాజీ ఏమయ్యాడో తెలియదు. అంతకుముందు అయినా అడపా దడపా సినిమాలు చేసేవాడు. కానీ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. రెండో సీజన్లో విపరీతమైన పాపులారిటీ, ఫాలోయింగ్ సంపాదించుకున్నట్లు కనిపించిన కౌశల్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. అతనో పెద్ద బ్రాండ్‌గా మారిపోయినట్లు కలరింగ్ ఇచ్చారు కానీ.. చూస్తుండగానే లైమ్ లైట్లో లేకుండా పోయాడు. సినిమాల్లో కానీ, టీవీ షోల్లో కానీ అతను పెద్దగా కనిపించట్లేదు.
ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ షోకు రాకముందు ఉన్న స్థాయిలోనే ఉన్నాడు. కొత్తగా అయితే సినిమా అవకాశాలు పెరిగిపోలేదు. నాలుగో సీజన్లో విజేతగా నిలిచిన అభిజిత్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
‘బిగ్ బాస్’ నాలుగు సీజన్ పూర్తయిన కొత్తలో అయితే అభిజిత్ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతాడని.. అతడికి అవకాశాలు తన్నుకొచ్చేయబోతున్నాయని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. టైటిల్‌కు దూరమైన సోహెల్, అఖిల్, దివి లాంటి వాళ్లు సినిమా అవకాశాలు అందుకున్నారు. సోహెల్ హీరోగా ఒకటికి రెండు సినిమాలు పట్టాలెక్కాయి. అఖిల్ సైతం ఇటీవలే ఓ సినిమాను మొదలుపెట్టాడు. దివికి రెండు మూడు సినిమా ఛాన్సులు వచ్చాయి.
గత సీజన్లో మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో చాలామంది టీవీ షోల్లో బిజీ అయిపోయారు. ఇంతమంది పొలాల్లో మొలకలు వచ్చాయి కానీ.. అభిజిత్ పొలంలోనే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. అభిజిత్ ప్రయత్నించడం లేదా.. అతణ్ని ఎవరూ సంప్రదించడం లేదా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి ‘బిగ్ బాస్’ టైటిల్ గెలిస్తే వచ్చే పాపులారిటీ తాత్కాలికమే అని, దాని వల్ల సినిమా కెరీర్ పెద్దగా పుంజుకోవడం ఏమీ ఉండదని మరోసారి స్పష్టమైంది.
This post was last modified on April 19, 2021 11:36 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…