సాధారణంగా హీరోయిన్లకు పెళ్లవగానే గ్లామర్ డోస్ తగ్గించేస్తుంటారు. అంతకుముందు గ్లామర్ విందు చేసి ఉన్నప్పటికీ.. పెళ్లవ్వగానే ట్రెడిషనల్‌గా తయారవుతుంటారు. చాలామంది అసలు పొటో షూట్లకు దూరంగా ఉంటారు. అవి చేసినా హాట్‌గా కనిపించాలని అనుకోరు.
కానీ సమంత మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె పెళ్లి కాకముందు కంటే ఆ తర్వాతే గ్లామర్ డోస్ పెంచడం విశేషం. పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటో షూట్లేంటి అని ఫ్యాన్స్ అభ్యంతర పెడితే.. ఆ తర్వాత మరింత డోస్ పెంచి మరీ ఫొటో షూట్లు చేసిన టిపికల్ అమ్మాయి సమంత. మధ్యలో వర్కవుట్లు మరీ ఎక్కువ చేసి సమంత ముఖంలో, ఒంట్లో గ్లో కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ.. ఈ మధ్య మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా తయారైంది సామ్. తాజాగా ఆమె చేసిన ఒక ఫొటో షూట్ వావ్ అనిపిస్తోంది.
ట్రెండీ డ్రెస్సింగ్, హేర్ స్టైలింగ్ చేసుకుని ఒక బొకే పట్టుకుని సూపర్ సెక్సీగా తయారైన సమంత.. ఈ తరం యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది ఈ ఫొటో షూట్లో. ఈ షూట్ కోసం ఆమె అంత ఆకర్షణీయమైన లొకేషన్, ప్రాపర్టీస్ కూడా ఎంచుకోలేదు. ఆకర్షణ అంతా తనలో ఉంటే లొకేషన్, ప్రాపర్టీస్‌తో ఇంకేం పని అన్నట్లు చాలా సింపుల్‌గానే కానిచ్చేశారు.
ఈ ఫొటోలు చూస్తే సమంతకు ఇప్పుడు 33 ఏళ్లు వచ్చేశాయంటే నమ్మబుద్ధి కానట్లే ఉంది. మొన్ననే ఒక యోగా ఫొటోతో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించిన సామ్.. ఇప్పుడు తన గ్లామర్ ఎటాక్‌తో కుర్రాళ్ల ఫోన్లు, ల్యాప్‌టాపుల్లోకి వెళ్లిపోయింది. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో శాకుంతలం అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసమే సమంత మళ్లీ కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా తయారైంది.
This post was last modified on April 19, 2021 6:46 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…