బన్నీపై దిల్ రాజు ఆశలు వదులుకోలేదు!

సుకుమార్ కథ చెప్పిన కొద్దీ రోజులకే ఐకాన్ కథ విని సింగల్ సిట్టింగ్ లో అల్లు అర్జున్ ఓకే చేసాడు. అల్లు అర్జున్ గత పుట్టినరోజున ఐకాన్ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేసారు. ఒక టైంలో సుకుమార్ సినిమా కంటే ఐకాన్ ముందుగా రూపొందుతుందని చెప్పుకున్నారు. అయితే అల వైకుంఠపురములో పూర్తి చేసేలోగా సుకుమార్ పుష్ప కథ రెడీ చేయడం, అల్లు అర్జున్ అటు వెళ్లిపోవడం జరిగిపోయాయి.

మరి ఐకాన్ చేస్తాడా చేయడా అనే దానిపై ఒక డౌట్ అయితే అలాగే ఉంది. ఆ సినిమా ఎప్పటికి అయినా తానె చేస్తానని, ఆ కథ వేరే ఎవరికీ చెప్పవద్దని అల్లు అర్జున్ చెప్పాడట. అలాగే ఆ కథని పాన్ ఇండియాకి సరిపోయేట్టుగా మార్చమని కూడా సూచించాడట. మరి అల్లు అర్జున్ ఈ సినిమా చేసేది ఉందా లేదా? దిల్ రాజు అయితే ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ పుట్టినరోజుకి కూడా ఆ పోస్టర్ పెట్టి విషెస్ చెప్పాడు.