తమిళ లెజెండరీ కమెడియన్ వివేక్ ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రెండు రోజుల ముందు వరకు ఓ టీవీ కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నవాడు.. మొన్నటి దాకా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడిలా హఠాత్తుగా కన్నుమూయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది మంది మెచ్చిన వ్యక్తి.. ఇలా యాక్టివ్‌గా ఉండగా, ఇంకా ఎంతగానో అలరించే అవకాశం ఉండగానే హఠాత్తుగా మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వివేక్ ఎంత మంచి కమెడియనో, అతను ఏ స్థాయిలో నవ్వించాడో తమిళ ప్రేక్షకులు ఎవరిని కదిలించినా కథలు కథలుగా చెబుతారు. తెలుగు ప్రేక్షకులకు సైతం వివేక్ కామెడీ పంచ్ పవర్ ఎలాంటిదో తెలుసు. ఐతే వివేక్ కమెడియన్‌గా ఏ స్థాయిలో మెప్పించాడో.. బయట ఒక వ్యక్తిగా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నాడు. భవిష్యత్తు తరాల పట్ల ఎంతో బాధ్యతతో ఆయన చెట్ల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రాజకీయ నాయకులను మెప్పించేందుకు ఒక చెట్టు నాటి నాలుగు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి హడావుడి చేసే తరహా సెలబ్రెటీ కాదు ఆయన. మొన్నటి దాకా ఆయన చేతుల మీదుగా ఏకంగా 33.23 లక్షల చెట్లు నాటడం విశేషం.
అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో ఎన్నో ఏళ్ల కిందటే ఆయన ఈ ఉద్యమాన్ని చేపట్టారు. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారీగా చెట్లు పెంచకుంటే భవిష్యత్ తరాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందంటూ ఆయన ఎన్నో పాఠశాలలు, కళాశాలలకు తిరిగి విద్యార్థులతో పెద్ద ఎత్తున చెట్లు నాటించారు. ఎన్నో సంస్థలతో కలిసి పని చేశారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన కోటి మొక్కలు నాటాలని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు కూడా. తన ట్విట్టర్ బయోలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఇది కాక మరెన్నో సేవా కార్యక్రమాలు వివేక్ చేతుల మీదుగా జరిగాయి. తెర మీద కామెడీని పంచే ఆయన.. బయట చాలా సీరియస్‌గా ఉంటూ మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేవారు. ఇలా ఆయనలోని మంచి గుణాలన్నింటినీ ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుని ఆవేదనకు గురవుతున్నారు.
This post was last modified on April 18, 2021 3:06 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…