అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో ఇప్పుడేం సినిమా తెరకెక్కుతోంది.. వీళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించే చిత్రమేది అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించిన మాట వాస్తవమే కానీ.. అది సినిమా కోసం కాదులెండి. ఓ యాడ్ కోసం. నాగార్జున దీర్ఘ కాలంగా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం కొత్తగా ఒక యాడ్ చేశాడు. అందులో నాగ్ చెల్లెలిగా రెజీనా నటించడం విశేషం.
ఇదే యాడ్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయ బచ్చన్ సైతం కనిపించారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన గుండెల మీద పెరిగిన చెల్లెలు అత్తారింటికి వెళ్లిపోతోందే అని వేదన చెందే అన్నయ్యగా నాగ్.. బాధ పడకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పే చెల్లెలిగా రెజీనా కనిపించారు. బ్యాగ్రౌండ్లో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టారు ఈ ప్రకటనలో.
అమితాబ్ సైతం ఉండటంతో ప్రకటనను చాలా రిచ్‌గానే తీర్చిదిద్దారు. కళ్యాణ్ జువెలర్స్ ఆరంభం నుంచి ఆ సంస్థతో కొనసాగుతున్నాడు నాగ్. ఆ సంస్థకు పేరు తెచ్చిందే నాగ్. ఆయన ప్రకటనల వల్ల మంచి పాపులారిటీనే వచ్చింది. మొదట్లో ఆ యాడ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈ సంస్థలో ఆయనకు వాటాలు కూడా ఉన్నాయంటారు. సినిమాల విషయానికొస్తే ఇటీవలే వైల్డ్ డాగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్లో బ్రహ్మాస్త్రను పూర్తి చేశాడు. త్వరలోనే బంగార్రాజు చిత్రాన్ని మొదలుపెట్టే యోచనలో నాగ్ ఉన్నాడు.
This post was last modified on April 18, 2021 7:06 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…