నందమూరి బాలకృష్ణ, రవితేజల మధ్య ఏదో వ్యక్తిగత వివాదం ఉందని అప్పట్లో ఒక ప్రచారం నడిచింది. అదెంత వరకు నిజమో కానీ.. వ్యక్తిగతంగా ఇద్దరూ ఎప్పుడూ కలిసి కనిపించరు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరి మధ్య ఎప్పట్నుంచో వార్ నడుస్తోంది. రవితేజతో పోలిస్తే బాలయ్యే పెద్ద స్టార్ కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రవితేజదే పైచేయి. ఇంతకుముందు నందమూరి హీరోకు పోటీగా దిగిన ప్రతిసారీ మాస్ రాజా తన సినిమాతో పైచేయి సాధించాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వీరి మధ్య పోరు ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ను మే 28న రిలీజ్ చేయడానికి నిర్ణయించగా.. అదే రోజు రవితేజ సినిమా ‘ఖిలాడి’ని షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ముందు డేట్లు ఇచ్చేశారు కానీ.. వీటిలో ఏదో ఒక సినిమా తప్పుకుంటుందేమో అనుకున్నారు. అందులోనూ ఈ మధ్య కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు సినిమాలూ అనుకున్న తేదీకి రావడం డౌటే అన్న అభిప్రాయాలు కలిగాయి.
కానీ ఇటు ‘అఖండ’ టీం కానీ.. అటు ‘ఖిలాడి’ బృందం కానీ తమ సినిమాను వాయిదా వేసే ఆలోచన ఎంతమాత్రం చేయట్లేదట. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్లో రావాల్సిన మూడు పేరున్న సినిమాలు వాయిదా పడిపోయాయి. మే 13కు షెడ్యూల్ అయిన ‘ఆచార్య’ సైతం వెనక్కి వెళ్తుందంటున్నారు. కానీ అఖండ, ఖిలాడి సినిమాలు మాత్రం వాయిదా పడే ఛాన్సే లేదని ఆయా చిత్ర బృందాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల చిత్రీకరణ చివరి దశలో ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో అవి పూర్తవుతాయని.. నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని మే 28కి కచ్చితంగా తమ సినిమాలను తీసుకురావాలని ఆ సినిమాల నిర్మాతలు చూస్తున్నారు.
ఇటీవలే రిలీజైన ఈ రెండు సినిమాల టీజర్లూ ఆకట్టుకున్నాయి. అంచనాల్ని పెంచాయి. ఎవరికి వారు తమ సినిమాపై ధీమాగా ఉన్నారు. పోటీ గురించి ఆలోచించట్లేదు. ఈసారి ఎలాగైనా రవితేజను దెబ్బ కొట్టాలనే పంతంతో బాలయ్య ఉండగా.. బాలయ్యపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని మాస్ రాజా చూస్తున్నాడు. మరి మే 28న ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 17, 2021 4:41 pm
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…