Movie News

వివేక్ మృతికి వ్యాక్సిన్ కారణమా?


తమిళ కమెడియన్ వివేక్ కొన్ని రోజుల కిందటే హుషారుగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మొన్నటిదాకా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నాడు. అందరూ కరోనాకు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించాడు. తాను కూడా అందుకు సిద్ధమయ్యాడు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతి రోజే ఆరోగ్యం విషమించింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటలకే తుది శ్వాస విడిచాడు. ఉన్నట్లుండి వివేక్ పరిస్థితి ఎందుకు విషమించింది.. ఇందుక్కారణం వ్యాక్సిన్ వేసుకోవడమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్నాయి.

వివేక్‌కు చికిత్స అందించిన ఆసుపత్రి శనివారం రాత్రి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో.. వివేక్‌కు గుండెపోటు రావడానికి, వ్యాక్సినేషన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఐతే వ్యాక్సిన్ పట్ల జనాల్లో వ్యతిరేకత ఏర్పడుతుందేమో అన్న అనుమానాలతోనే ఇలా ప్రెస్ నోట ఇప్పించారేమో అన్న సందేహాలు కలిగాయి.

తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ అయితే.. వివేక్ మృతికి వ్యాక్సినేషనే కారణమని తేల్చేశాడు. అధికార వర్గాలను నిందిస్తూ ఉద్వేగానికి గురయ్యాడు. కానీ టీకా వేసుకోవడం వల్ల జ్వరం, దద్దుర్లు, కాళ్ల వాపు లాంటి లక్షణాలు రావడం మామూలే. కానీ ప్రాణాపాయం తలెత్తిన సందర్భాలు అరుదు. పైగా గుండె పోటుకు దారితీసిన కేసులు దాదాపు లేవు.

వివేక్ మృతి పట్ల అనేక అనుమానాలు తలెత్తడం, సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండటంతో తమిళనాడు హెల్త్ సెక్రటరీ మీడియా ముందుకు వచ్చారు. వివేక్ గుండె వాల్వ్‌లు వంద శాతం మూసుకుపోయాయని.. ఒక్క రోజులో ఇలా జరగదని.. వ్యాక్సిన్‌కు, ఇలా వాల్వ్‌లు మూసుకుపోవడానికి అసలు సంబంధం లేదని.. వివేక్ తన గుండె విషయంలో జాగ్రత్త పడకపోవడం వల్లే ఆయన ప్రాణాలు పోయాయని స్పష్టం చేశారు. వివేక్ వ్యాక్సినేషన్ చేయించుకున్న అదే ఆసుపత్రిలో శుక్రవారం వందల మంది టీకా వేసుకున్నారని.. వాళ్లెవ్వరికీ ఎలాంటి ఇబ్బందులూ రాలేదని.. కాబట్టి వ్యాక్సిన్ పట్ల జనాల్లో భయం పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

This post was last modified on April 17, 2021 4:33 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

8 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

34 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago