సెలబ్రెటీల జీవితం పూల పాన్పు లాంటిది అనుకుంటాం కానీ.. ఆ హోదాలో కొనసాగడంలో కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కాలంలో సినీ ప్రముఖులను, ముఖ్యంగా లేడీ సెలబ్రెటీలను టార్గెట్ చేయడం అన్నది మామూలు విషయంగా మారిపోయిన నేపథ్యంలో సున్నిత మనస్కులైతే ఈ ధాటిని తట్టుకోవడం కష్టమే. తాను చాలాసార్లు ఇలాంటివి పట్టించుకోనప్పటికీ.. కొన్నిసార్లు మాత్రం సోషల్ మీడియా కామెంట్లకు తట్టుకోలేకపోతుంటానని అంటోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.
సెలబ్రెటీగా పేరు తెచ్చుకున్నాక కూడా తాను ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు అనసూయ వెల్లడించింది. సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన సందర్భాల్లో తాను డిప్రెషన్‌కు గురైనట్లు ఆమె తెలిపింది. ఓసారి తనకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. కానీ ఏమైందో ఏమో కొన్ని రోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయని.. అలాంటి సమయంలో భర్త దగ్గర కూర్చుని బాగా ఏడ్చేసేదాన్నని అనసూయ చెప్పింది. తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారని.. కొన్నిసార్లు మాత్రం అవి చాలా బాధిస్తుంటాయని ఆమె అంది.
ఒక సందర్భంలో తన పెద్ద కొడుకు సైతం తాను వెస్ట్రన్, షార్ట్ డ్రెస్‌లు వేస్తే బాగా లేదని, పొడవాటి దుస్తులు వేసుకోవాలని చెబుతుంటాడని, ఇలాంటి మాటలు వింటే ఏదోలా ఉంటుందని అనసూయ చెప్పింది. తాను ఎక్కువ బాధ పడ్డ సందర్భాల్లో రాత్రి పూట అప్పుడప్పుడూ వైన్ తాగుతుంటానని అనసూయ చెప్పింది. ఇటీవలే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో పైన పటారం లోన లొటారం అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన అనసూయ.. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎప్పట్లాగే బుల్లితెరపై జబర్దస్త్ సహా చాలా షోలు చేస్తోంది.
This post was last modified on April 17, 2021 11:49 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…