Movie News

హన్సిక.. నెవర్ బిఫోర్ మూవీ

టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భామ హన్సిక మొత్వాని. ‘దేశముదురు’ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన హన్సిక.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆపై తమిళంలోకి వెళ్లి విజయ్, సూర్య, విశాల్, శింబు లాంటి పెద్ద హీరోలతో నటించింది. తెలుగులో ఆమె కెరీర్ దెబ్బ తిన్నప్పటికీ.. తమిళంలో మాత్రం ఆమెకు ఢోకా లేకపోయింది.

గత కొన్నేళ్లలో కొంచెం జోరు తగ్గినప్పటికీ.. ఇప్పటికీ అవకాశాలకేమీ లోటు లేదు. కాకపోతే ఒకప్పటిలా పెద్ద సినిమాలు మాత్రం చేతిలో లేవు. స్టార్ల సరసన కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో హన్సిక ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆమె ఒక వినూత్నమైన చిత్రాన్ని అంగీకరించింది. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు రాని తరహా సినిమా అట ఇది.

ఒకే క్యారెక్టర్.. ఆ క్యారెక్టర్ మీద సింగిల్ షాట్లో తీయబోయే సినిమాలో హన్సిక నటించబోతుండటం విశేషం. ఆ సినిమా పేరు.. 105 మినిట్స్. రాజు దుస్సా అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బేనర్ మీద బొమ్మక్ శివ నిర్మిస్తున్నాడు. ఇందులో హన్సిక తప్ప వేరే నటీనటులు ఉండరు. కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి ఎడిటింగ్ ఏమీ లేకుండా.. కంటిన్యుటీతో ఒకే షాట్‌తో కథ మొత్తం చెప్పేస్తారట. ఇలాంటి ప్రయోగం ఇండియాలో ఇంత వరకు ఎవ్వరూ చేయలేదట. వినడానికైతే ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ కాన్సెప్ట్‌ను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి. ఇలాంటి సినిమాలో హన్సిక లాంటి స్టార్ హీరోయిన్ నటించడం విశేషమే.

ఇక హన్సిక కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో ‘మహా’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. ఇందులో ఆమె వయొలెంట్ క్యారెక్టర్ చేసింది. తెలుగులో చివరగా హన్సిక.. సందీప్ కిషన్ సరసన ‘తెనాలి రామకృష్ణ’లో నటించింది.

This post was last modified on April 17, 2021 12:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago