తమిళ లెజెండరీ కమెడియన్లలో ఒకరైన వివేక్ గుండె పోటుకు గురై ఆసుపత్రి పాలవడం ఆయన అభిమానులను కలవర పరుస్తోంది. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వివేక్‌కు కొంచెం తీవ్ర స్థాయిలోనే గుండె పోటు వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన గురువారమే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా వేసుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మామూలే. కొందరికి జ్వరం వస్తుంది. కాళ్లల్లో వాపు, దద్దుర్లు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఐతే గుండెపోటు రావచ్చన్న సంకేతాలు అయితే వ్యాక్సిన్ మార్గదర్శకాల్లో కనిపించవు. మరి వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే వివేక్ గుండెపోటుకు గురయ్యాడా అన్నది చెప్పలేం. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకుని మామూలు మనిషి కావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
వివేక్ ఒకప్పుడు ఒక దశాబ్దం పాటు తమిళ సినిమాను ఏలాడు. గౌండ్రమణి, వడివేలు లాంటి కమెడియన్ల హవా తగ్గాక 90ల చివర్లో వివేక్ జోరు మొదలైంది. ఆ టైంలో ప్రతి పేరున్న సినిమాలోనూ వివేక్ కనిపించేవాడు. తనదైన టైమింగ్‌తో ఆయన మామూలుగా నవ్వించలేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా వివేక్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. సినిమాల్లో ఎంతో హడావుడి చేస్తూ నవ్వించే వివేక్.. బయట మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు. ఆయన జీవితంలో ఓ పెద్ద విషాదం కూడా ఉంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో ఆయన కొడుకు చనిపోవడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.
అంతకుముందున్న కమెడియన్లను వివేక్ వెనక్కి నెట్టినట్లే.. ఓ దశాబ్దం పాటు వివేక్ హవా నడిచాక.. ఆయన్ని వెనక్కి నెట్టి సంతానం టాప్ కమెడియన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ మధ్య వివేక్ మళ్లీ కొన్ని అవకాశాలు అందుకుని అడపదడపా సినిమాలు చేస్తున్నాడు.
This post was last modified on April 16, 2021 2:13 pm
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…