Movie News

తన రికార్డును బద్దలు కొట్టేసిన పవన్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల మోత మోగిపోవాల్సిందే. ఎప్పుడో ఏడేళ్ల కిందట చివరగా పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’కి పాజిటివ్ టాక్ వచ్చింది. అప్పుడా సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన తెలిసిందే. ఐతే ఆ తర్వాత పవన్ సినిమా దేనికీ పాజిటివ్ టాక్ రాలేదు. వస్తే పవన్ తన రికార్డులనే కాదు.. వేరే రికార్డులను కూడా బద్దలు కొట్టేసేవాడేమో.

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి.. ఇలా పవన్ నుంచి వచ్చిన మూడు సినిమాలకూ నెగెటివ్ టాకే వచ్చింది. అవి మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఐతే ఇప్పుడు వాటితో పోలిస్తే తక్కువ అంచనాలతో వచ్చిన ‘వకీల్ సాబ్’ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌ను, ఏపీలో టికెట్ల రేట్ల నియంత్రణను తట్టుకుని మరీ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వీకెండ్లో పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ‘వకీల్ సాబ్’.. రూ.100 కోట్ల షేర్ దిశగా పరుగులు పెడుతోంది.

ఈ క్రమంలో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. బుధవారం ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్‌ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ‘అత్తారింటికి దారేది’ అప్పట్లో రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అప్పటికది చాలా పెద్ద ఫిగర్. పవన్ ఆ తర్వాత చేసిన సినిమాలు దీన్ని మించి బిజినెస్ చేశాయి. వాటికి మంచి టాక్ వస్తే ‘అత్తారింటికి దారేది’ రికార్డు ఎప్పుడో బద్దలయ్యేది. కానీ అవన్నీ డిజాస్టర్లు కావడంతో పవన్ హైయెస్ట్ గ్రాసర్‌గా మొన్నటి వరకు ‘అత్తారింటికి దారేది’నే కొనసాగింది.

ఎట్టకేలకు ఆ రికార్డును ‘వకీల్ సాబ్’ బద్దలు కొట్టేసింది. వీక్ డేస్‌లోనూ బలంగా సాగుతున్న ‘వకీల్ సాబ్’కు కొత్త సినిమాల నుంచి పోటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ పవన్ కెరీర్లో తొలి రూ.100 కోట్ల షేర్ మూవీగా నిలవడం లాంఛనమే అనిపిస్తోంది.

This post was last modified on April 15, 2021 6:11 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

18 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago