ఒక స్టార్ హీరో సినిమా మేకింగ్ దశలో ఉండగా.. ఆ చిత్ర బృందంలోంచి ఎవరైనా మీడియాలో మాట్లాడుతూ అందులోని సన్నివేశాల గురించి ఎలివేషన్లు ఇస్తే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. అందులోనూ ఒక క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఇలాంటి విశేషాలు బయటపెడితే ఆసక్తి మరింతగా ఉంటుంది.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ’ మీద ఇప్పటికే భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్, తాజాగా విడుదల చేసిన టైటిల్ రోర్ వీడియోలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి. ఆ అంచనాల్ని ఇంకా పెంచేలా ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్న సమ్మెట గాంధీ.
ఇటీవలే ‘వకీల్ సాబ్’లో పవన్ పక్కనే ఉండే ముఖ్య పాత్రతో ఆకట్టుకున్న గాంధీ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.అందులో బాలయ్య-బోయపాటి సినిమా గురించి మాట్లాడాడు. ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ మామూలుగా ఉండదని.. థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఆయన అన్నారు. అంతకుమించి ఏమీ తాను మాట్లాడలేనని.. సినిమా విశేషాలేమీ బయటపెట్టొద్దని బోయపాటి చిత్ర బృందంలో అందరికీ స్పష్టంగా చెప్పాడని గాంధీ అన్నారు.
aసింహా, లెజెండ్ సినిమాలను మించి ‘అఖండ’ ఉంటుందని.. వాటిని మించి గొప్ప విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానని గాంధీ అన్నారు. ఈ సినిమాలో తనది మరీ ఎక్కువ నిడివి ఉన్న పాత్ర కాదని.. కానీ చాలా కీలకంగా ఉంటుందని గాంధీ చెప్పారు. ఒక సన్నివేశంలో తన నటనకు బోయపాటి సూపర్ అంటూ కితాబిచ్చారని, అప్పుడు సెట్లో ఉన్న 200 మంది చప్పట్లు కొట్టారని గాంధీ తెలిపారు. బాలయ్య ఇంట్రో సీన్ మామూలుగా ఉండదంటూ గాంధీ చెప్పిన వీడియోను నందమూరి అభిమానులు చాలా ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
This post was last modified on April 15, 2021 4:12 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…