నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడు కానీ.. తర్వాతి తరం కథానాయకుల జోరు ముందు ఆయన నిలవలేకపోయారు. ట్రెండుకు తగ్గట్లు అప్ డేట్ కాలేక దారుణమైన ఫలితాలను అందుకున్నారు. ముందు నుంచి ఉన్న ఫాలోయింగ్ ఓకే కానీ.. ఈ తరం యువ ప్రేక్షకుల మనుసులను ఆయన గెలవలేకపోయారన్నది వాస్తవం. అందుకే యంగ్ హీరోల సినిమాలతో పోలిస్తే.. సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల గురించి పెద్దగా చర్చ ఉండదు.
యూట్యూబ్‌లో బాలయ్య టీజర్లు, ట్రైలర్లు రిలీజైనపుడు వాటికొచ్చే వ్యూస్, లైక్స్ తక్కువగా ఉంటుంటాయి. అందులో బాలయ్యకు ఎప్పుడూ పెద్దగా రికార్డులు కనిపించవు. సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల టీజర్లు, ట్రైలర్లు ట్రెండ్ కావడం కూడా తక్కువే. ఐతే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి.
ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్ రోర్ రిలీజ్ చేసినపుడు.. తాజాగా టైటిల్ రోర్ విడుదల సందర్భంగా అనూహ్యమైన స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని స్థాయిలో బాలయ్య సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ 24 గంటల్లోనే10 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. రెండు రోజులు పూర్తయ్యేసరికి వ్యూస్ 13 మిలియన్ల మార్కును దాటాయి. లైక్స్ 3 లక్షలకు చేరువగా ఉన్నాయి. మొన్నట్నుంచి ఈ టీజర్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
మిగతా సమయాల్లో అంతరాలున్నప్పటికీ.. బోయపాటితో బాలయ్య చేసిన క్రేజీ మూవీ అనేసరికి నందమూరి అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా ఈ టీజర్‌ను ఇంతగా ఆదరించడం వల్ల ఇన్ని వ్యూస్ వచ్చాయా.. లేక యాడ్స్ వల్ల వ్యూస్ పెరిగాయా.. లేక బాలయ్యను ట్రోల్ చేయడానికి రెడీగా ఉండే యాంటీ ఫ్యాన్స్ అందరూ టీజర్ పట్ల ఆసక్తి ప్రదర్శించడం వల్ల ‘అఖండ’ టైటిల్ రోర్‌కు ఇంత ఆదరణ దక్కిందా అన్నది తెలియదు కానీ.. రెండు రోజులుగా బాలయ్య పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
This post was last modified on April 15, 2021 1:11 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…