Movie News

ప‌వ‌న్ హ‌వా.. దీనికే ఇలా ఉంటే

‘వకీల్ సాబ్’ మొద‌లైన‌పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ ఇలాంటి సినిమాతోనా అంటూ అభిమానులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పింక్ సినిమాను రీమేక్ చేయొద్దంటూ సోష‌ల్ మీడియాలో ఉద్య‌మాలు కూడా చేశారు. అస‌లీ సినిమా స‌క్సెస్ అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా కలిగాయి మేకింగ్ దశలో ఉండగా. ఎందుకంటే పవన్ నుంచి అభిమానులు ఆశించే తరహా చిత్రం కాదిది.

ఇది రీమేక్.. పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. కథ గురించి ముందే ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఒరిజినల్‌తో పోలిస్తే పవన్ పాత్రను పెంచినా, హీరోయిజం కలిపినా అది పెద్దగా సింక్ కాలేదు. ఐతే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిన కోర్ట్ రూం డ్రామాను తెలుగులోనూ ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో పాటు అందులోనూ పవన్‌కు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో సినిమా పాసైపోయింది. ఓ మోస్తరు వినోదాన్ని అందిస్తేనే పవన్ అభిమానులు ఫిదా అయిపోయారు. సామాన్య ప్రేక్షకులు కూడా ‘వకీల్ సాబ్’కు పట్టం కట్టారు.

త‌క్కువ అంచ‌నాల‌తో మొద‌లైన వ‌కీల్ సాబ్‌కు ఈ స్థాయి ఫ‌లితం వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అలాంటిది స్ట్రెయిట్ మూవీతో అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను మెప్పించే వినోదాన్నందిస్తే ఇక పవన్ ప్రభంజనం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. పవన్ నుంచి రాబోతున్న సినిమాలు అలాంటి ఆశలే రేకెత్తిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ పవన్ అభిమానుల్లో ఎంతగానో ఉత్కంఠ రేపుతోంది. పవర్ స్టార్ స్టామినాకు ‘బాహుబలి’ తరహా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుందని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు ఫ్యాన్స్. వారి కోరికను క్రిష్ తీర్చేయబోతున్నాడు. దీని టీజర్ చూస్తే ‘బాహుబలి’ లైన్లోనే ఉన్నట్లు కనిపించింది.

ఇక హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ తర్వాత పవన్‌తో మరో మాంచి మాస్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. దాని మీదా అంచనాలు మామూలుగా లేవు. మరోవైపు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లోనూ పవన్ నటిస్తుండగా.. ఇందులో ఆయన చేస్తున్నది మంచి మాస్ టచ్ ఉన్న పాత్ర. ఈ సినిమాలన్నీ రిలీజై, అవి అంచనాలకు తగ్గట్లు ఉంటే పవన్ అభిమానులకు పండగన్నమాటే.

This post was last modified on April 15, 2021 7:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కీర్తి సురేష్…బ్యాడ్ లక్ బేబీ!

బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…

5 hours ago

కెజిఎఫ్ హీరోయిన్ దశ తిరుగుతోంది

ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…

6 hours ago

సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…

8 hours ago

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…

9 hours ago

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

10 hours ago