ఒక స్టార్ హీరో సినిమా హిట్టయితే ఇంకో స్టార్ హీరో హర్షించడం.. ఆ హీరోకు అభినందనలు చెప్పడం పెద్దగా కనిపించేది కాదు ఒకప్పుడు. ఒక వేళ అలా చేయాలన్నా అదో పెద్ద తతంగం లాగా ఉండేది. మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే అవతలి హీరోను వెళ్లి నేరుగా కలిసి అభినందించాలి. ఇగో పక్కన పెట్టి ఇలా చేయాలంటే హీరోలకు మనసొప్పేది కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఇబ్బంది లేకపోయింది. ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా వెళ్లి కలవాల్సిన పని లేదు. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే చాలు. ఈ పని చాలామంది హీరోలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తనకు ఏ సినిమా నచ్చినా ఏ భేషజాల్లేకుండా ట్విట్టర్లో పోస్ట్ పెట్టేస్తుంటాడు. ఆ హీరో ఈ హీరో అనే తేడాలేమీ చూడడు. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా చూసి మహేష్.. పవన్ మీద, చిత్ర బృందం మీదా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఐతే ‘వకీల్ సాబ్’ బాగా నచ్చేసి పవన్‌ను అభినందించిన మరో వ్యక్తి కూడా ఉన్నాడట. అతనెవరో కాదు.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే మహేష్ లాగా తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. నేరుగా పవన్‌ను కలిసి కౌగిలించుకుని మరీ అభినందనలు తెలిపాడట. సినిమా చూసి అతను ఎమోషనల్ అయ్యాడట. ఈ విషయాన్ని ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ వెల్లడించడం విశేషం.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారని, తారక్ అయితే పవన్‌ను హత్తుకుని అభినందనలు తెలిపాడని వెల్లడించడం విశేషం. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం నేపథ్యంలో తారక్ ఇలా పవన్‌ను కౌగిలించుకుని అభినందనలు తెలిపాడన్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
This post was last modified on April 14, 2021 2:58 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…