అఖిల్ ని వెంటాడుతున్న దురదృష్టం!

అఖిల్ అక్కినేనికి అన్నీ ఉన్నా కానీ అదృష్టం కలిసి రావడం లేదు. మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అవడంతో ప్రస్తుతం ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు.

ఆ సినిమాకి పీక్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేసారు. రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా సీజన్ బాగా ప్లస్ అయ్యేది. షూటింగ్ ఆగిపోవడంతో మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందనేది ఐడియా లేదు. ప్రస్తుతానికి దసరా టైంకి వస్తుందని అనుకుంటున్నారు. కానీ అప్పటికి చాలా సినిమాలు లైన్లో ఉంటాయి.

సమ్మర్ లో చైతన్య లవ్ స్టోరీ కోసం అనుకున్న డేట్ అఖిల్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు చాలా సినిమాలతో పోటీ పడి ఫలితం కోసం చూడాల్సి ఉంటుంది. అదీ కాకుండా ప్రతి సినిమా మధ్య చాలా గ్యాప్ కూడా వచ్చేస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ కనుక అటు ఇటు అయితే అఖిల్ కష్టాలు మరింత పెరుగుతాయి.