ఏడాదికి పైగా విరామం తర్వాత తెలుగులో ఒక పెద్ద హీరో సినిమా రిలీజైంది. అందులోనూ ఆ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయె. పైగా వచ్చింది ఆయన రీఎంట్రీ మూవీ. దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేముంది.. వకీల్ సాబ్‌కు వసూళ్ల మోత మోగుతోంది. తొలి వారాంతంలో భారీ ఓపెనింగ్స్ సాధించి.. సోమవారం కొంచెం జోరు తగ్గించిన వకీల్ సాబ్.. మంగళవారం మళ్లీ పుంజుకున్నాడు. ఉగాది సెలవు కావడంతో ఐదో రోజు ఈ సినిమాకు వసూళ్లు ఒక్కసారిగా పెరిగాయి. వీకెండ్ వసూళ్లకు మంగళవారం కలెక్షన్లు ఉంటాయని భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది సినిమా. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో అయితే.. థియేటర్లన్నీ నిండిపోయి చాలా థియేటర్లలో ఎక్స్‌ట్రా చైర్లు వేసే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో సినిమాలు హౌస్ ఫుల్ అయితే అదనపు కుర్చీలు వేయడం మామూలే. ఐతే 2020 సంక్రాంతి తర్వాత ఇలాంటి పరిస్థితి ఏ సినిమాకూ రాలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ ట్రెండును మళ్లీ తీసుకొచ్చాడు.
ఆంధ్రా, సీడెడ్, నైజాం అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ మంగళవారం వకీల్ సాబ్‌కు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ ఒక్క రోజులో ఏపీ, తెలంగాణ షేర్ రూ.10 కోట్లకు తక్కువగా ఉండదని అంచనా వేస్తున్నారు. సెలవు కలిసొచ్చినా సరే.. రిలీజైన ఐదో రోజు ఇంత షేర్ అంటే మామూలు విషయం కాదు. వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ షేర్ రూ.70 కోట్లకు చేరువగా వెళ్తోంది. ఈ వీకెండ్లో పేరున్న కొత్త సినిమాలేవీ కాబట్టి వకీల్ సాబ్ జోరుకు ఢోకా లేనట్లే.
This post was last modified on April 13, 2021 11:53 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…