ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే అని నందమూరి అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు కొన్ని రోజుల కిందటి వరకు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన గత ఏఢాదే వచ్చింది. కొన్ని వారాల కిందట కూడా ఈ కాంబినేషన్ పక్కా అనే చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. త్రివిక్రమ్‌తో తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ చేయట్లేదన్న సమాచారం బయటికి వచ్చింది. ముందు ఇది రూమర్ అనే అంతా అనుకున్నారు. కానీ అదే నిజమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నాడు. సోమవారం సాయంత్రం ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి ప్రకటన కూడా రాబోతోందని.. కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడని అంటున్నారు.
ఐతే ‘అరవింద సమేత’ టైంలో, ఆ తర్వాత ఎంతో సన్నిహితంగా కనిపించిన ఎన్టీఆర్, త్రివిక్రమ్.. తమ కాంబినేషన్లో రెండో సినిమాకు కమిటై ఏడాది పాటు సంప్రదింపులు జరుపుతూ సాగాక ఇప్పుడు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఎవరికీ అర్థం కావడం లేదు. తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు వస్తే తప్ప ఇలా ఓ సినిమా రద్దవదు. గతంలో మహేష్ బాబు, సుకుమార్‌ల మధ్య కూడా ఇలాగే తేడా కొట్టి సినిమా క్యాన్సిల్ అయింది. సుహృద్భావ వాతావరణంలోనే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని, తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారని అన్నారు. కానీ ఎవరి దారులు వారివి అయ్యాయి.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ విషయంలోనూ ఇలాగే అయిందని అనుకుంటున్నారు. కానీ వీరి సన్నిహితులు చెబుతున్న ప్రకారం.. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక మంచి వాతావరణంలోనే ప్రస్తుతానికి తమ కలయికలో సినిమా వద్దనుకున్నారని.. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయమని అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవేం జరగలేదని.. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలు అయ్యాక ముందు అనుకున్నట్లే హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 32వ సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడని సమాచారం.
This post was last modified on April 12, 2021 3:12 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…