కరోనా కేసులు తగ్గాయి. భయం పోయింది. థియేటర్లు పునఃప్రారంభం అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనూ మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచారు. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇది చూసి గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో సినిమాల రిలీజ్‌కు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక కరోనా ప్రభావం సినిమాలపై ఏమీ ఉండదనే అనుకున్నారంతా.
మళ్లీ టాలీవుడ్ పూర్వఫు ఫామ్ అందుకుని అంతా సంతోషంగా ఉన్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మళ్లీ ఇండస్ట్రీని దెబ్బ కొడుతోంది. కేసులు బాగా పెరిగిపోవడంతో థియేటర్లపై ఆంక్షలు తప్పేట్లు లేవు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుల్లో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేశారు. ఏపీ, తెలంగాణల్లోనూ ఈ దిశగా అడుగులు పడటం లాంఛనమే అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రావాల్సిన లవ్ స్టోరి సినిమాను వాయిదా వేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం వకీల్ సాబ్ లాంటి భారీ చిత్రం థియేటర్లలో ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంచెం ఆగాయని.. మరి కొన్ని రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు కావడం లాంఛనమే అని అంటున్నారు. ఇదే జరిగితే ఈ నెల 23న రావాల్సిన టక్ జగదీష్ సైతం వాయిదా పడక తప్పదేమో.
లవ్ స్టోరి వాయిదా నిర్ణయం వెల్లడి కాగానే.. నాని సినిమా విషయంలో ఏం చేస్తారనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. వచ్చే వారంలో కరోనా ప్రభావం ఎలా ఉండబోతోంది.. ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు పెడుతుందా లేదా అన్నదాన్ని బట్టి టక్ జగదీష్ టీం తమ సినిమాను వాయిదా వేయాలా వద్దా అని నిర్ణయం తీసుకునే అవకాశముంది.
This post was last modified on April 11, 2021 8:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…