అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘వైల్డ్ డాగ్’ నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా. మూడు నెలల ముందే ఆ డీల్ కూడా పూర్తయింది. అప్పటికి కరోనా భయం వెంటాడుతోంది. థియేటర్లు అప్పుడే తెరుచుకున్నాయి. జనాలు థియేటర్లకు వస్తారో రారో అన్న సందేహాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటీటీ రిలీజే కరెక్ట్ అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే సంక్రాంతికి సినిమాలు వచ్చాయి. చాలా బాగా ఆడాయి. దీంతో చిత్ర బృందంలో అంతర్మథనం మొదలైంది.
నెట్ ఫ్లిక్స్ వాళ్లతో మళ్లీ మాట్లాడి డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. ముందు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత నెలా నెలన్నర గ్యాప్ ఇచ్చి నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేలా కొత్తగా ఒప్పందం కుదిరింది. ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ రిలీజ్‌కు ఇచ్చేట్లయితే రూ.20 కోట్ల దాకా ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు రెడీ అయ్యారు. కానీ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లడంతో సగానికి సగం రేటు తగ్గించేసినట్లు సమాచారం.
కట్ చేస్తే మంచి సీజన్ కోసం వెయిట్ చేసి ఏప్రిల్ 2న ఈ ‘వైల్డ్ డాగ్’ను రిలీజ్ చేశారు. బాగా ప్రమోట్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఏం లాభం? ఈ సినిమా చూసేందుకు జనాలు పెద్దగా థియేటర్లకు రాలేదు. ఫుల్ రన్లో మరీ అన్యాయంగా రూ.3 కోట్ల షేర్ సాధించిందీ సినిమా. ఈ సినిమాను అమ్మిందే తక్కువ రేట్లకు. ఆ మొత్తం కూడా వెనక్కి రాలేదు. సగం కంటే తక్కువ రికవరీతో డిజాస్టర్ అయింది ‘వైల్డ్ డాగ్’. సినిమాకు మరీ ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
వీకెండ్ అవ్వగానే ‘వైల్డ్ డాగ్’ పూర్తిగా డల్లయిపోగా.. ఈ వారం ‘వకీల్ సాబ్’ రాకతో థియేటర్ల నుంచి అంతర్ధానం అయింది. ఇప్పుడు సినిమా ఊసే లేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని నిర్మాత తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆదాయం ఎక్కువ వచ్చేది. ఇలా బాక్సాఫీస్ దగ్గర నాగ్ పరువు పోయేది కూడా కాదు. ఇప్పుడు థియేటర్లలో ఆడని సినిమాను నెట్ ఫ్లిక్స్‌లో చూసేందుకు జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది సందేహం. ఈ రకంగా ‘వైల్డ్ డాగ్’ పరిస్థితి రెంటికీ చెడ్డట్లు అయింది.
This post was last modified on April 11, 2021 8:41 am
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…