గత నెలలో చావు కబురు చల్లగా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన సుకుమార్.. అల్లు అర్జున్‌తో తాను చేస్తున్న పుష్ప సినిమా ముచ్చట్లు చెప్పమని అభిమానులు అరుస్తుంటే.. సినిమా లోపలి ముచ్చట్లు చెప్పలేక ఈ సినిమా తర్వాత బన్నీకి స్టైలిష్ స్టార్ ట్యాగ్ పోతుందని.. అతను మాస్ ఐకానిక్ స్టార్ అవుతాడని వ్యాఖ్యానించాడు. అప్పుడది వినడానికి బాగానే అనిపించింది. కానీ నిజంగా బన్నీ పేరు ముందు ఆ ట్యాగ్ వేసుకుంటాడని ఎవరూ అనుకోలేదు.
సుకుమార్ మాట వరసుకు అన్న మాటను అందరూ లైట్ తీసుకుంటారనే అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా కొందరు పీఆర్వోలు బన్నీ పేరు ముందుకు మాస్ ఐకానిక్ స్టార్ తెచ్చి పెట్టేసి ట్వీట్లు వేశారు. ఇది బన్నీ పీఆర్ టీం మహిమ అని అంతా అనుకున్నారు. అంతటితో వ్యవహారం ముగిసినట్లే అనుకుంటే.. ఈ ట్యాగ్‌ను తర్వాత కూడా కొనసాగిస్తుండటం, ఇప్పుడు అధికారికంగానే బన్నీ పేరు ముందుకు ఐకాన్ స్టార్ అని వచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే బతుకు బస్టాండ్ అనే సినిమా టీం నుంచి బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ.. అందులో మాస్ ఐకానిక్ స్టార్ అని ట్యాగ్ జోడించారు.
అదే టూమచ్ అనుకుంటే.. ఇప్పుడు పుష్ప టీజర్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది. ముందు బన్నీ పేరు ముందు స్టైలిష్ స్టార్ అని వేసి.. దాన్ని చెరిపేసి ఐకాన్ స్టార్ అని వేసేశారు. ఇది చూసి చాలామంది సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ చేస్తున్నారు. సుకుమార ఏదో మాట వరసకి అంటే.. ఇలా ఐకాన్ స్టార్ అని వేసేసుకుంటారా అని కౌంటర్లు వేస్తున్నారు. ఇంతకుముందు శక్తి సినిమాకు తారక్ ఏ1 స్టార్ అని వేసుకుని అబాసుపాలైన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు.
This post was last modified on April 8, 2021 12:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…