పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పునరాగమన చిత్రం ‘వకీల్ సాబ్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అలాగని ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోతుందని అనుకోవడానికి లేదు. రీఎంట్రీలో పవన్ ముందు పెద్ద టార్గెట్టే ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు వంద కోట్ల దాకా షేర్ రాబట్టాలి.
వరల్డ్ వైడ్ వకీల్ సాబ్ థియేట్రికల్ హక్కులు రూ.96 కోట్లకు అమ్ముడవడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా రూ.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. కరోనా అనంతరం తెలుగు సినిమాల బిజినెస్ దెబ్బ తిన్నప్పటికీ.. వకీల్ సాబ్ విషయానికి వచ్చేసరికి బయ్యర్లేమీ వెనుకంజ వేయలేదు.
ఉత్తరాంధ్ర వరకు ఈ సినిమా రూ.11 కోట్లు రాబట్టింది. రాయలసీమ హక్కులు రూ.13.5 కోట్లు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.31 కోట్లు పలికాయి హక్కులు. నైజాం ఏరియాలో దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేస్తుండగా.. ఆ ప్రాంత థియేట్రికల్ హక్కుల విలువ రూ.25 కోట్లని అంచనా వేస్తున్నారు. కర్ణాటక హక్కులు రూ.6 కోట్ల దాకా పలకగా.. ఓవర్సీస్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్మారు. ఇలా వరల్డ్ వైడ్ బిజినెస్ భారీగానే జరిగింది.
కాబట్టి రూ.100 కోట్ల షేర్ వస్తే తప్ప బయ్యర్లు లాభాల బాట పట్టరన్నమాట. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలకు రూ.50 కోట్ల ఆదాయం రావడం విశేషం. మొత్తంగా పవన్‌ను నమ్ముకుని పింక్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను రీమేక్ చేస్తూ రూ.150 కోట్ల మేర బిజినెస్ చేయడమంటే మామూలు విషయం కాదు.
This post was last modified on April 7, 2021 10:47 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…