పవర్ పేట.. దాదాపు రెండేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన చిత్రమిది. ఇంతకుముందు వీరి కలయిలో ‘చల్ మోహన్ రంగ’ అనే క్లాస్ లవ్ స్టోరీ వచ్చింది. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈసారి దానికి భిన్నంగా పూర్తి స్థాయి రస్టిక్ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమైంది నితిన్-కృష్ణ చైతన్య జోడీ. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత శ్రమతో కూడిన సినిమా ఇదని నితిన్ ఈ మధ్యే చెప్పుకొచ్చాడు.
ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి నెలవైన పవర్ పేట అనే ప్రాంతం మీద ఎంతో పరిశోధన జరిపి ఈ సినిమాకు స్క్రిప్టు తీర్చిదిద్దాడు కృష్ణచైతన్య. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్ట్రో’ పూర్తి కాగానే ఈ సినిమా మొదలుపెట్టాలని అనుకున్నాడు. సొంత బేనర్లోనే ఈ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదని, కొంచెం వెనక్కి వెళ్తోందని వార్తలొస్తున్నాయి.
నితిన్ ఇటీవలే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. రచయితగా కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన వంశీ.. దర్శకుడిగా చేసిన తొలి సినిమా ‘నా పేరు సూర్య’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆ దెబ్బ నుంచి కోలుకుని మరో సినిమా లైన్లో పెట్టుకోవడానికి చాలా సమయం పట్టేసింది. చివరికి నితిన్ హీరోగా సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది.
ఐతే ‘పవర్ పేట’ ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడుకున్న సినిమా కావడంతో అది పూర్తి చేసి, వంశీ సినిమా మీదికి రావడానికి సమయం పడుతుందని.. దాని కంటే వంశీతో ముందు సినిమా చేసి, ఆ తర్వాత ‘పవర్ పేట’ మొదలు పెట్టడం మంచిదని నితిన్ భావిస్తున్నాడట. వంశీ సినిమాను వేగంగా పూర్తి చేసేయడానికి ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు తెలిసింది.
This post was last modified on April 7, 2021 2:19 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…