రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో.. ఎప్పుడు పూర్తి చేస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. ఆయన ప్రకటించిన ఆపేసిన.. అలాగే షూటింగ్ మధ్యలో వదిలేసిన.. పూర్తి చేశాక పక్కన పెట్టేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. పట్టపగలు. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
చడీచప్పుడు లేకుండా మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమాను పూర్తి చేసిన వర్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు కానీ.. సినిమా విడుదల సంగతి తేల్చలేదు. టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర ప్రోమోలేవీ ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి. విడుదలకు సన్నాహాలు జరిగాయి కానీ.. సినిమాకు బిజినెస్ జరగలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో పట్టపగలు చిత్రాన్ని పక్కన పెట్టేసి యధావిధిగా వేరే ప్రాజెక్టు వైపు వెళ్లిపోయాడు వర్మ.
కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను బయటికి తీస్తున్నాడు వర్మ. ఇదేదో కొత్త సినిమా అనుకునేలా దానికి టైటిల్ మార్చేయడం విశేషం. దెయ్యం అని పేరు పెట్టాడు. దెయ్యం పేరుతో వర్మ నుంచి ఇంతకుముందే ఓ సినిమా వచ్చింది. కాబట్టి దెయ్యం ముందర ఆర్జీవీ అని తన పేరే చేర్చుకున్నాడు. బిగ్ బాస్ షోలో చేసిన సాక్షి దీక్షిత్ ఇందులో కీలక పాత్ర పోషించింది.
రాజశేఖర్ ఈ సినిమా కోసం మేకప్ లేకుండా నటించడం విశేషం. ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఇది దెయ్యం-చేతబడుల చుట్టూ తిరిగే మామూలు హార్రర్ సినిమాలాగే కనిపించింది. వర్మ పాత సినిమాలనే తలపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. ఐతే వర్మ మాత్రం ఈ నెల 16న తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తానంటున్నాడు. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on April 7, 2021 11:11 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…