పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ హంగామాకు ఇంకో మూడు రోజులే సమయం ఉంది. ఈ శుక్రవారం ఆయన రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. సినిమా మొదలైనప్పటి కథ వేరు. ఇప్పుడు వేరు. ఇది రీమేక్ మూవీ అయినా, లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కినా.. అవేవీ పవన్ సినిమాపై హైప్ తగ్గించలేకపోయాయి.
ఇందులో పవన్ అభిమానులకు నచ్చే అంశాలకు లోటు లేదని సంకేతాలు అందడంతో హైప్ ఆటోమేటిగ్గా వచ్చేసింది. రిలీజ్ దగ్గర పడేసరికి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయీ చిత్రానికి. కాకపోతే ఒకటే ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలు పడేలా లేవు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నం జరుగుతోంది కానీ.. ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ రాలేదు.
పవన్ రీఎంట్రీ మీద ఉన్న ఆసక్తి దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో ఎక్కడైనా సరే.. బెనిఫిట్ షోలు వేసినా, అదనపు షోలు నడిపించినా.. వీకెండ్లో భారీగా అదనపు ఆదాయం వస్తుంది. షేర్ అనూహ్యంగా ఉంటుంది. వీకెండ్ అంతా పండుగ చేసుకోవచ్చు. డిమాండ్ దృష్ట్యా బెనిఫిట్ షోలకు ఎంత రేటు పెట్టినా కొంటారు జనం. ఈ నేపథ్యంలో వాటి కోసం ఘనంగా ప్రణాళికలు వేసుకున్నారు. ఏపీలో అయితే భారీగా షోలు ప్లాన్ చేశారు.
కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా సానుకూల సంకేతాలు కనిపించాయి కానీ.. నిన్న ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగాక పరిస్థితులు మారిపోయాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడమే ఎక్కువ అని.. ఈ స్థితిలో అదనపు షోలకు అవకాశమిచ్చి కోవిడ్ వ్యాప్తికి కారణం కాకూడదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు, అదనపు షోలు దాదాపు లేనట్లే. మరి ఈ స్థితిలో పవన్ మూవీ వంద కోట్ల షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం అంటే సవాలే. అదే కనుక పవన్ సాధించగలిగాడంటే అతడి క్రేజ్‌కు తిరుగులేనట్లే.
This post was last modified on April 6, 2021 6:03 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…