ఇండియన్ సినిమాలు ఓ వైపు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేక చతికిలపడుతుంటే.. ఓ హాలీవుడ్ మూవీ వచ్చి అదరగొట్టేయడం ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ సినిమానే.. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ ఇప్పటికి పెద్ద ఎత్తున థియేటర్లలో రన్ అవుతోంది ఈ హాలీవుడ్ మూవీ.
పిల్లలకు విపరీతంగా నచ్చే జానర్ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగానే చూస్తున్నారు. ఉత్తరాదిన హిందీ సినిమాలకు కనీస స్పందన కొరవడగా.. ఈ చిత్రానికి మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి. మల్టీప్లెక్సులు ఈ సినిమా మీదే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
రెండో వీకెండ్లో కూడా ఈ సినిమా మంచి షేర్ రాబట్టింది. సెకండ్ వీకెండ్లో ఈ సినిమా మూడు రోజులు కలిపి దేశవ్యాప్తంగా రూ.7 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అంతకుముందు తొలి వారంలో గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయబోతోంది. ఫుల్ రన్లో రూ.65-70 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో కరోనా విరామం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదొకటి.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఇదే నంబర్ వన్ సినిమాగా నిలుస్తోంది. అక్కడ హిందీ సినిమాలు నామమాత్రంగా రిలీజవుతుండగా.. వాటికి రోజు రోజుకూ పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. దీంతో సినిమాల విడుదలే ఆపేస్తున్నారు. దీంతో అక్కడి థియేటర్లు నడపడానికి గాడ్జిల్లా వెర్సస్ కింగ్ రెండు వారాలుగా ఉపయోగపడుతోంది. దక్షిణాదిన సైతం ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.
This post was last modified on April 6, 2021 7:42 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…