Movie News

కేజీఎఫ్‌ను చూసి వాత పెట్టుకున్నారే..


సౌత్ ఇండియాలో కంటెంట్ క్వాలిటీ ప‌రంగా క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ అన్నింటికంటే దిగువ‌న ఉంటుంది. అక్క‌డ ఇప్ప‌టికీ ఫార్ములాటిక్ మాస్ సినిమాల‌దే రాజ్యం. స్టార్ హీరోలంద‌రూ మూస మాస్ సినిమాలే చేస్తుంటారు. వేరే భాష‌ల్లో ఒక క‌మ‌ర్షియ‌ల్ సినిమా హిట్ట‌యితే చాలు.. దాన్ని ప‌ట్టుకొచ్చి రీమేక్ చేసేస్తుంటారు. తెలుగు, త‌మిళంలో ఎప్పుడో అర‌గ‌దీసేసిన మాస్ ఫార్ములాల‌నే వాళ్లు అనుస‌రిస్తుంటారు.

అప్పుడ‌ప్పుడూ అక్క‌డ కూడా కొన్ని విభిన్న‌మైన, ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు వ‌స్తుంటాయి కానీ.. ఎక్కువ‌గా మూస మాస్ సినిమాలదే రాజ్యం. అందుకే క‌న్న‌డ హీరోలు వేరే భాష‌ల వాళ్ల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోతుంటారు. ఆ భాషా చిత్రాలు క‌ర్ణాట‌క దాటి పెద్ద‌గా ప్ర‌భావం చూప‌వు. ఒక‌ప్పుడు ఉపేంద్ర మాత్రమే కొంత ప్ర‌భావం చూప‌గ‌లిగాడు. చాలా ఏళ్ల‌కు కేజీఎఫ్ సినిమా బౌండ‌రీలు దాటి ప్ర‌భావం చూపింది. ఆ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో భారీ విజ‌యాన్నే అందుకుంది.

ఐతే కేజీఎఫ్ ఆడేయ‌గానే.. కన్న‌డ స్టార్ హీరోలకు తెలుగు మార్కెట్ మీద ఆశ పుట్టేసి తమ సినిమాల‌ను అనువాదం చేయ‌డం మొద‌లుపెట్టారు. గ‌త నెల‌లో శాండిల్‌వుడ్ బిగ్ స్టార్ల‌లో ఒక‌డైన ద‌ర్శ‌న్ సినిమా రాబ‌ర్ట్ తెలుగులో రిలీజ్ కాగా.. ఈ నెల‌లో మ‌రో పెద్ద స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మూవీ యువ‌ర‌త్న తెలుగులో విడుద‌లైంది. అలాగే కేజీఎఫ్ స్టార్ య‌శ్ న‌టించిన పాత సినిమాను గ‌జ‌కేస‌రి పేరుతో ఇక్క‌డ వ‌దిలారు. కానీ వీటిలో ఏదీ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఇవ‌న్నీ రొటీన్ మాస్ మ‌సాలా సినిమాలే.
ప్ర‌స్తుతం మ‌న హీరోల‌వే ఇలాంటి సినిమాలు న‌డ‌వ‌డం క‌ష్టంగా ఉంది. ఇక మ‌న‌కు ప‌రిచ‌యం లేని హీరోలు అవే చేస్తే ఏం ప‌ట్టించుకుంటారు. ఏదైనా కొత్త‌గా ట్రై చేస్తే, ప్ర‌యోగాలు చేస్తే వాటిపై ఓ లుక్కేస్తారేమో కానీ.. ఈ టైపు మ‌సాలా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌డం క‌ష్ట‌మ‌ని క‌న్న‌డ స్టార్లు అర్థం చేసుకోవాలి. లేదంటే రిలీజ్ ఖ‌ర్చులు కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం క‌ష్టం.

This post was last modified on April 6, 2021 7:18 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago