Movie News

‘వైల్డ్ డాగ్’కు ‘సుల్తాన్’ షాక్

ఈ శుక్రవారం రిలీజైన రెండు సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్నది అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీనే. దీనికి పోటీగా విడుదలైన ‘సుల్తాన్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక కార్తితో పోలిస్తే నాగార్జున పెద్ద హీరో. పైగా కార్తి మన హీరో కూడా కాదు. ఇలా ఏ రకంగా చూసినా ‘వైల్డ్ డాగ్’ది బాక్సాఫీస్ దగ్గర పైచేయి కావాలి. కానీ ఆశ్చర్యకరంగా శుక్రవారం ‘వైల్డ్ డాగ్’ మీద ‘సుల్తాన్’ పైచేయి సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ఏరియాల్లో ‘వైల్డ్ డాగ్’ కన్నా ‘సుల్తాన్’కు ఎక్కువ వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఓవరాల్ కలెక్షన్లలో ‘వైల్డ్ డాగ్’ కాస్త పైచేయి సాధించింది. కానీ అంతరం పెద్దగా లేదు. నాగ్ గత సినిమాల ప్రభావం వల్లో ఏమో.. ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా తొలి రోజు చాలా తక్కువ షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపితే డే-1 షేర్ రూ.1.21 కోట్లకు పరిమితమవడం షాకింగ్‌గా అనిపిస్తోంది. నాగ్ రేంజి స్టార్లలో ఎవరి సినిమాలకూ గత కొన్నేళ్లలో తొలి రోజు ఇంత తక్కువ షేర్ రాలేదు.

అదే సమయంలో ‘సుల్తాన్’కు తొలి రోజు రూ.1.15 కోట్ల షేర్ వచ్చింది. ఒక డబ్బింగ్ సినిమాకు తొలి రోజు ఇంత షేర్ రావడం గొప్ప విషయమే. అందులోనూ ఒక పెద్ద స్టార్ సినిమాతో పోటీ పడుతూ.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ షేర్ చిన్నదేమీ కాదు. నిన్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ మెయిన్ థియేటర్లలో ప్రతి షోకూ ‘వైల్డ్ డాగ్’ కంటే ‘సుల్తాన్’కు ఎక్కువ షేర్ రావడం గమనార్హం. ఏపీ, తెలంగాణల్లో పలు ఏరియాల్లో ‘వైల్డ్ డాగ్’ కన్నా ‘సుల్తాన్’కు షేర్ ఎక్కువ వచ్చింది.

వచ్చే వారం ‘వకీల్ సాబ్’ రానున్న నేపథ్యంలో నాగ్ మూవీ ఏం సాధించినా ఈ వారమే సాధించాలి. మంచి టాక్‌ను వసూళ్లుగా మలుచుకుని తొలి వారాంతంలో మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టకపోతే.. ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుని ‘వైల్డ్ డాగ్’ను థియేటర్లలో రిలీజ్ చేయడంలో అర్థం ఉండదు. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కచ్చితంగా వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం ఆశిస్తోంది. వీకెండ్ కలిసొస్తుందన్న అంచనాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on April 3, 2021 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

3 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

5 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 hours ago