స్టార్ హీరో అన్నాక ఏదో ఒక దశలో తప్పక చేసే పాత్రల్లో పోలీస్ క్యారెక్టర్ ఒకటి. హీరోయిజం ఎలివేట్ చేయడానికి, మాస్‌ను ఉర్రూతలూగించడానికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పోలీస్‌ది. టాలీవుడ్లో నిన్నటితరం పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పోలీస్ పాత్రలు చేసిన వాళ్లే. తర్వాతి తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ.. ఖాకి వేసి భారీ విజయాలందుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సైతం పోలీస్ పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఇప్పుడు కొత్తగా ఖాకి తొడగడానికి రెడీ అవుతున్నాడు యంగ్ హీరో రామ్. ఇన్నాళ్లూ రామ్ మరీ కుర్రాడిలా, ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్‌తో కనిపించడం వల్లో ఏమో పోలీస్ పాత్రల వైపు వెళ్లలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి సినిమాలతో అతడి ఇమేజ్ మారింది.
రఫ్, మాస్ క్యారెక్టర్లు రామ్‌కు ఈ మధ్య బాగానే సూటవుతున్న నేపథ్యంలో తమిళ దర్శకుడు లింగుస్వామి.. అతణ్ని పోలీస్ పాత్రతోనే మెప్పించినట్లు సమాచారం. వీళ్ల కలయికలో ఇటీవలే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. రామ్ ఎనర్జీకి మంచి పోలీస్ పాత్ర పడితే ఎలా రెచ్చిపోతాడో అంచనా వేయొచ్చు.
ఇంతకుముందు ‘వేట్టై’ సినిమాలో పోలీస్ పాత్రను భలేగా డిజైన్ చేసి మెప్పించాడు లింగుస్వామి. తెలుగులో ‘తడాఖా’ పేరుతో రీమేక్ అయిందా సినిమా. అందులో సునీల్ చేశాడా పాత్రను. ఇప్పుడు మరి రామ్ కోసం లింగుస్వామి ఎలాంటి పాత్ర సిద్ధం చేశాడో చూడాలి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
This post was last modified on April 2, 2021 3:04 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…