కరోనా విరామం తర్వాత.. టాలీవుడ్లోనే కాదు, మొత్తం ఇండియాలోనే రిలీజవుతున్న అతి పెద్ద చిత్రం ‘వకీల్ సాబ్’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ చేస్తే దాన్ని చూడ్డానికి అభిమానులు థియేటర్లకు ఎలా పరుగులు పెట్టారో.. థియేటర్ల బయట, లోపల ఎంత హంగామా నెలకొందో తెలిసిందే.
ట్రైలర్‌కే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజైతే సందడి ఏ స్థాయిలో ఉంటుందో అంటూ అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ట్రైలర్లో పవన్ హీరోయిక్స్, మాస్ అంశాలు పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా సినిమా కథేంటో చెప్పే ప్రయత్నమే జరిగింది. ఇక రిలీజ్ రోజు థియేటర్లకు వెళ్లే అభిమానులకు బోలెడన్ని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయన్న ప్రచారం గట్టిగా సాగుతోంది.
‘పింక్’కు అదనంగా కలిపిన పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అదే పెద్ద సర్ప్రైజ్ అంటున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ద్వితీయార్ధంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని.. అభిమానులు అది చూసి వెర్రెత్తిపోతారని సంకేతాలు ఇచ్చాడు. దీంతో ఏంటా సర్ప్రైజ్ అనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ ఒక క్యామియో రోల్ గురించే ఈ చర్చంతా అని అంటున్నారు.
ఒక మెగా హీరో సినిమాలో మెరవబోతున్నారని.. కొన్ని నిమిషాలు మాత్రమే ఆ పాత్ర ఉంటుందని.. అది మెగా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు. మరి ఆ క్యామియో చేసింది మెగాస్టార్ చిరంజీవా లేక ఆయన తనయుడు రామ్ చరణా లేక ఇంకెవరైనా మెగా హీరోనా అన్నది చూడాలి. దీని గురించి రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.
This post was last modified on April 1, 2021 6:14 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…