ఈ ఏడాది ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అగ్ర స్థానం ‘ఆర్ఆర్ఆర్’కు కట్టబెట్టాల్సిందే. ఇది బేసిగ్గా తెలుగు సినిమానే కానీ.. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో దీనికి ఆటోమేటిగ్గా పాన్ ఇండియా స్టేటస్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
రాజమౌళితో పాటు ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా మొదలైన కొన్ని రోజులకే ఈ చిత్రానికి బిజినెస్ మొదలైపోయింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొన్ని ఏరియాలకు బిజినెస్ కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. ఇటీవలే డిజిటల్, శాటిలైట్ హక్కుల డీల్ కూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు దీనిపై అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చేసింది.
‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి అన్ని భాషలకూ కలిపి డిజిటల్, శాటిలైట్ హక్కులను బాలీవుడ్‌కు చెందిన పెన్ మూవీస్ సొంతం చేసుకుంది. దీని అధినేత జయంతిలాల్ గద ఇటీవలే ఒప్పందాన్ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని గురువారం ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ట్విట్టర్లో ప్రకటించింది. ఈ సంస్థ వివిధ భాషల డిజిటల్, శాటిలైట్, ఇంటర్నెట్ హక్కులనే కాదు.. నార్త్ ఇండియా వరకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను సైతం సొంతం చేసుకోవడం విశేషం.
‘బాహుబలి’ని హిందీలో అదిరిపోయే రీతిలో మార్కెట్ చేసి.. భారీగా రిలీజ్ చేసి సినిమా ఉత్తరాదిన ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరణ్ జోహార్ సైతం రేసులో నిలిచారట కానీ.. ఆయన్ని మించి భారీ రేటుతో జయంతిలాల్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్, ఇంటర్నెట్ హక్కుల కోసం ఆయన రూ.200 కోట్లకు పైగానే చెల్లించబోతున్నట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమాల్లో రికార్డ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on April 1, 2021 2:00 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…