ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా తమ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించారు. కొన్ని వారాల వ్యవధిలో పదుల సంఖ్యలో సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కరోనా కారణంగా గత ఏడాది చాలా సినిమాలు మధ్యలో, పూర్తయ్యాక ఆగిపోవడంతో ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన చిత్రాల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. దీంతో చాలా ముందుగా రిలీజ్ కోసం కర్చీఫ్‌లు వేయాల్సి వచ్చింది.
సినిమా రిలీజ్ చేస్తామో లేదో ముందు డేట్ అయితే ఇచ్చేద్దాం అన్నట్లుగా ఒకరిని చూసి ఒకరు అనౌన్స్‌మెంట్లు ఇచ్చేశారు. ఆ తర్వాతేమో డెడ్ లైన్ అందుకోవడానికి కిందా మీదా అయిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు.. షూటింగ్‌లు ప్రస్తుతం అనుకున్నట్లుగా సాగట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పేరున్న సినిమాలకు రిలీజ్ డేట్లు మార్చుకోక తప్పేట్లు లేదు.
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘పుష్ప’ ఆగస్టు 13న రావడం సందేహమే అని గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా భారీ కాస్ట్ అండ్ క్రూతో ముడిపడింది. ఇప్పటికే ఒకసారి ఎక్కువమందితో షూటింగ్ చేస్తూ కరోనా దెబ్బ కొట్టడంతో కొన్ని వారాలు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ యూనిట్‌ను భయపెడుతోంది. ఎక్కువమంది కాస్ట్ అండ్ క్రూతో ఇంకా చాలా రోజులు చిత్రీకరణ సాగించాల్సి ఉంది. మధ్య మధ్యలో బ్రేకులు పడుతుండటం, లొకేషన్లు పదే పదే మార్చాల్సి వస్తుండటంతో అనుకున్నంత వేగంగా సినిమా పూర్తి కావట్లేదట. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ మేకర్స్‌లో లేదనే అంటున్నారు.
మరోవైపు మే 28న రిలీజ్ కావాల్సిన బాలయ్య-బోయపాటి సినిమా కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశాల్లేవని అంటున్నారు. ఇంకో రెండు నెలల్లోపే రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. సినిమా అనుకున్న డేట్‌కు రాదనడానికి ఇదే సూచిక అంటున్నారు. రీషూట్లు, స్క్రిప్టులో మార్పులు చేర్పుల వల్లే ఆలస్యం జరుగుతోందని.. సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని అంటున్నారు.
This post was last modified on April 1, 2021 10:03 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…