టాలీవుడ్లో మరే హీరోకూ దొరకని ఎంట్రీ లభించింది మెగా కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్‌కు. మెగాస్టార్ వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తొలి సినిమా చిరుతతో నెలకొల్పిన రికార్డును కేవలం మూడు రోజుల్లో వైష్ణవ్ డెబ్యూ మూవీ ఉప్పెన బద్దలు కొట్టేసింది. అప్పటికి, ఇప్పటికి టికెట్ల రేట్లు పెరిగి ఉండొచ్చు. పరిస్థితులు చాలా మారి ఉండొచ్చు. అయినా సరే.. చిరుత రికార్డును బద్దలు కొట్టడమే కాదు.. ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది ఈ సినిమా.
మిగతా అరంగేట్ర హీరోల్లాగా మాస్-యాక్షన్ మూవీ చేయకపోయినా.. ఒక ప్రేమకథతో ఇలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అనూహ్యం. పైగా ఇందులో వైష్ణవ్ డీగ్లామరస్ రోల్ చేశాడు. ఉప్పెన భారీ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు వరుస కడుతున్నారు.
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తన రెండో చిత్రాన్ని పూర్తి చేయగా.. నాగార్జున నిర్మాణంలో అతనో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అలాగే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌తోనూ ఓ సినిమా అన్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్టుకు వైష్ణవ్ సంతకం చేసినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఆ చిత్రాన్ని తమిళంలో ఆదిత్యవర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
సీనియర్ నిర్మాత, మెగా కుటుంబానికి సన్నిహితుడైన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మెహబూబాతో కథానాయికగా పరిచయం కానున్న కేతిక శర్మ ఇందులో కథానాయికగా నటించనుంది. వైష్ణవ్ మూడో సినిమా ఇదే కానుందని సమాచారం.
This post was last modified on March 28, 2021 10:33 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…