టాలీవుడ్ కామెడీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘ఎఫ్-2’. రెండేళ్ల కిందట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వినయ విధేయ రామ, యన్.టి.ఆర్-కథానాయకుడు లాంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి ఎంత పెద్ద విజయాన్నందుకుందో తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్ల షేర్‌తో ఆశ్చర్యపరిచిందీ చిత్రం. ఇప్పుడీ చిత్రానికి ‘ఎఫ్-3’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘ఎఫ్-2’లో ప్రధాన పాత్రలు పోషించిన విక్టరీ వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ఇందులోనూ కొనసాగబోతున్నారు. ‘ఎఫ్-2’లో ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంతగా గ్లామర్ విందు చేశారో తెలిసిందే. వీరికి తోడు అనసూయ భరద్వాజ్ ఒక పాట, కొన్ని సన్నివేశాల్లో మెరిసింది. సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసింది. ఇప్పుడు ‘ఎఫ్-3’లోనూ ఇలాగే అడిషనల్ గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రం కోసం అతను మరో హీరోయిన్ని తీసుకున్నాడు.
తెలుగులో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘లెజెండ్’, ‘రూలర్’లతో పాటు ‘పండగ చేస్కో’ లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ఎఫ్-3’లో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో ఫుల్ గ్లామరస్ రోల్ అని అంటున్నారు. ‘ఎఫ్-3’ లాంటి క్రేజీ సినిమాలో నటించడానికి ప్రస్తుతం ఫాంలో ఉన్న ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. అలాంటిది ‘రూలర్’ తర్వాత కనిపించకుండా పోయిన సోనాల్‌ను ఈ సినిమా కోసం తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఆమెకే ఈ రోల్ ఇవ్వడానికి కారణమేంటో తెర మీదే చూసి తెలుసుకోవాలి.
ఇప్పటికే 60 శాతానికి పైగా ‘ఎఫ్-3’ చిత్రీకరణ పూర్తయింది. మే-జూన్ మధ్య సినిమా షూటింగ్ అంతా అవగొట్టాలని చూస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్-2’ను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోంది.
This post was last modified on March 27, 2021 12:21 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…