వెబ్ సిరీస్‌ల విషయంలో తెలుగోళ్ల పర్సప్షన్ మారలేదని.. ఇంకా ఆ ఒరవడిని అందిపుచ్చుకోలేదని అనిపిస్తుంది మన వాళ్లు తీసే సిరీస్‌ల కంటెంట్ చూస్తే. హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు తీసే వాటితో పోలిస్తే ఇంకా మన సిరీస్‌లు ఒక స్థాయిని అందుకోలేదు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ లాంటి ఒకట్రెండు సిరీస్‌లు ఓకే అనిపించినా.. ఇంకా క్వాలిటీ, రిచ్‌నెస్ పెరగాల్సి ఉంది.
ఐతే ఈ దిశగా అడుగులైతే పడుతున్నాయని అనిపిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లూజర్ ట్రైలర్ చూస్తే ఇందులో విషయం ఉన్నట్లే ఉంది. జీ5 ఒరిజినల్స్‌లో భాగంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో లూజర్ తెరకెక్కడం విశేషం. ఈ నెల 15న దీని ప్రిమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
రైఫిల్ షూటింగ్‌లో చిన్న వయసులోనే జాతీయ స్థాయికి ఎదిగిన ఓ షూటర్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు చాలా దగ్గరా వెళ్లిన ఓ ఆటగాడు.. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో మెరిసే ప్రతిభ ఉన్న ఓ అమ్మాయి.. ఈ ముగ్గురి జీవితాల నేపథ్యంలో సాగే కథ లూజర్. వేర్వేరు కాలాల్లో వీరి కథలు నడుస్తాయి. ఐతే ఈ ముగ్గురి ఆశలకు ఒక దశలో బ్రేక్ పడుతుంది. అడ్డంకులు ఎదురవుతాయి.
ఐతే ఒక దశలో నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఈ ముగ్గురూ అడ్డంకుల్ని దాటుకుని ఎలా తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలుగా నిలిచారు అనే కథతో లూజర్ సిరీస్ తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే కథాంశం, ప్రెజెంటేషన్ సినిమా స్థాయికి తక్కువ కాని విధంగా కనిపిస్తున్నాయి. ప్రియదర్శితో పాటు శశాంక్, కల్పిక, షాయాజి షిండే ఇందులో కీలక పాత్రలు పోషించారు. మల్లేశం సినిమాతో సీరియస్ పాత్రల్లోనూ అదరగొట్టగలనని చాటిన ప్రియదర్శి.. లూజర్‌తోనూ సత్తా చాటుతాడేమో చూడాలి.
This post was last modified on May 10, 2020 5:50 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…