వరుస ఫ్లాపులతో చాలా ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నాడు షారుఖ్ ఖాన్. సినిమాలు ఫ్లాపవడం ఒక బాధ అయితే.. క్రమ క్రమంగా ఆయన మార్కెట్ కుచించుకుపోతుండటం, సినిమాల ఓపెనింగ్స్ అంతకంతకూ తగ్గిపోతుతండటం మరింత ఆందోళన రేకెత్తించే విషయం. షారుఖ్ నుంచి చివరగా వచ్చిన ‘జీరో’ సినిమా అయితే ఇండియాలో వంద కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అలాంటిది షారుఖ్ ఖాన్ ఇప్పుడు తన కొత్త చిత్రానికి రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం అంటోంది బాలీవుడ్ మీడియా.
‘జీరో’ తర్వాత రెండేళ్లకు పైగా విరామం తీసుకుని గత ఏడాదే ‘పఠాన్’ అనే సినిమా మొదలు పెట్టాడు షారుఖ్. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక బేనర్లో ‘వార్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. షారుఖ్ గత సినిమాల ప్రభావం దీని మీద ఎంతమాత్రం కనిపించడం లేదు.
మేకింగ్ దశలో ఉండగానే ‘పఠాన్’కు భారీగా హైప్ వచ్చేసింది. భారీగా బిజినెస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాతో షారుఖ్ మళ్లీ ఫామ్ అందుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. సినిమాకు తాము అంచనా వేసిందానికంటే ఎక్కువ బిజినెస్ ఆఫర్లు రావడంతో షారుఖ్‌కు ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం కింద ఇస్తున్నాడట నిర్మాత ఆదిత్య చోప్రా.
అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాభాల్లో వాటా రూపంలో ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగానే ఆర్జిస్తారని అంటుంటారు కానీ.. ఇలా పారితోషకం కింద రూ.100 కోట్లు పుచ్చుకుంటున్న తొలి ఇండియన్ హీరో షారుఖే అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వరుస ఫ్లాపుల వల్ల వెనుకబడ్డాడు కానీ.. ఫాలోయింగ్, మార్కెట్ పరంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో షారుఖ్ ఒకడు. మంచి సినిమా పడితే అతను పూర్వ వైభవం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఆ వైభవం ‘పఠాన్’తో వస్తుందేమో చూడాలి.
This post was last modified on March 26, 2021 12:53 pm
అసలే చిన్న కుమారుడు, ఆపై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వైనం.. అలాంటి కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిస్తే... ఏ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై…
సినిమాల్లో గూఢచారులంటే ప్రేక్షకులకు భలే క్రేజు. సూపర్ స్టార్ కృష్ణ 'గూఢచారి 116'తో మొదలుపెట్టి నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి…
ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం…
సజ్జల రామకృష్ణారెడ్డి... అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది.…
ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం…