పెద్ద హీరోల సినిమాలకు హైప్ రావాలన్నా, మంచి ఓపెనింగ్స్ ఉండాలన్నా అభిమానుల పాత్ర ఎంతో కీలకం. సోషల్ మీడియాలో తమ హీరోను, వాళ్ల సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ వాళ్లు కీలకంగా ఉంటారు. వాళ్ల డిమాండ్లను నెరవేర్చడానికి.. వాళ్లను మేనేజ్ చేయడానికి పీఆర్వోలు ప్రత్యేకంగా కొన్ని టీంలను పెట్టుకుని వ్యవహారాలు నడపడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.
హీరోల పుట్టిన రోజులు వచ్చినపుడు, వాళ్ల పాత సినిమాల వార్షికోత్సవాలు జరిగినపుడు, అలాగే కొత్త సినిమాలకు సంబంధించి ఏవైనా విశేషాలు బయటికి వచ్చినపుడు అభిమానులు సోషల్ మీడియాలో ఎంత హంగామా చేస్తుంటారో తెలిసిందే. ఇలాంటి వాటిపై హీరోలు దృష్టిసారించి.. వారికి వెన్నుదన్నుగా నిలవడం అనివార్యంగా మారింది. హీరోల పుట్టిన రోజులు వచ్చినపుడు పీఆర్ టీం ఎంతో కసరత్తు చేసి కామన్ డిస్‌ప్లే పిక్స్ (సీడీపీ) రూపొందించి అభిమానుల కోసం రిలీజ్ చేస్తున్న ట్రెండ్ కొన్నేళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
చిన్నా చితకా హీరోలకు కూడా సీడీపీల విషయంలో చాలా హంగామా చేస్తున్నారు. పెద్ద హీరోల పుట్టిన రోజులు వస్తుంటే.. పేరున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలతో సీడీపీలు తయారు చేయించే సంస్కృతి కూడా నడుస్తోంది టాలీవుడ్లో. గత ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రిలీజ్ చేసిన సీడీపీ ఎంత ప్రత్యేకంగా నిలిచిందో తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇంకో మూడు రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈసారి వేడుకలు ఘనంగా చేయడానికి అభిమాన సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చరణ్ సీడీపీ గురించి ఆ టీం కొన్ని రోజులుగా ఊరిస్తూ వస్తోంది.
సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, సమంత అక్కినేని, లావణ్య త్రిపాఠి తదితరులు ఈ సీడీపీ రిలీజ్ చేస్తారని ప్రచారం సాగించారు. అన్నట్లే బుధవారం సీడీపీ రిలీజ్ చేశారు. కానీ అందులో ఏ విశేషం లేకపోయింది. ఎవడు సినిమాలోంచి ఒక ఫొటో తీసి వెనుక ఒక స్టార్ పెట్టి ఇదే సీడీపీ అంటూ వదిలేశారు. అది చూసి చరణ్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఈమాత్రం దానికి ఇంత హంగామానా అంటూ చరణ్ పీఆర్ టీంను తిట్టేస్తున్నారు. పనిలో పనిగా సీడీపీ రిలీజ్ చేసిన తేజును కూడా వదలట్లేదు. దీని కంటే మేం తయారు చేసిన సీడీపీలు బాగున్నాయి కదా అంటూ తమ క్రియేటివిటీని చూపిస్తూ చరణ్ పీఆర్ టీం గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్.
This post was last modified on March 25, 2021 7:18 am
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…